మీరు అమ్ముడుపోయారు -కమల్‌

221
Kamal Haasan slams AIADMK and TTV Dhinakaran
- Advertisement -

శశికళ మేనల్లుడు దినకరన్ కేవలం ధనబలంతోనే ఆర్కేనగర్ ఉప ఎన్నికలో విక్టరీ కొట్టాడంటూ ప్రముఖ నటుడు కమలహాసన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటర్లను కొనుగోలు చేయడం ద్వారానే దినకరన్ గెలపు సాధ్యమయిందని, మన దేశ ప్రజాస్వామ్యానికి, తమిళనాడు రాజకీయాలకు ఆర్కేనగర్ ఉప ఎన్నికలు మాయని మచ్చగా మిగిలాయని విమర్శించారు.

Kamal Haasan slams AIADMK and TTV Dhinakaran

అంతేకాకుండా పాలకపక్షం అన్నాడీఎంకే కూడా ఓటర్లకు వెలకట్టిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమిళ మేగజీన్ ఆనంద వికటన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటర్లపై కూడా కమల్ విమర్శలు గుప్పించారు.

మీరు అమ్ముడుపోయారంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు కమల్ వ్యాఖ్యలను దినకరన్ ఖండించారు. తన గెలుపును జీర్ణించుకోలేకే కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు.

- Advertisement -