అల్లుడు శ్రీను, స్పీడున్నోడు లాంటి ఫ్లాప్ సినిమాల తరువాత ‘జయజానకి నాయక’ చిత్రంతో ఎట్టకేలకు హిట్ ట్రాక్ ఎక్కిన బెల్లంకొండ శ్రీనివాస్ ‘సాక్ష్యం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీనివాస్ సరసన డీజే భామ పూజా హెగ్డే నటిస్తుంది.
ఈ సినిమా ప్రకృతిలోని పంచభూతాల ఆధారంగా తెరకెక్కుతుండటం, ఇప్పటికే రిలీజైన కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమా మీద హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 9న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
శ్రీవాస్ డైరెక్షన్ లో వచ్చిన ‘లౌక్యం’, ‘లక్ష్యం’ సినిమాలు మంచి హిట్ గా నిలిచాయి. అందుకే ఆ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఈ సినిమాకి కూడా ‘సాక్ష్యం’ టైటిల్ పెట్టారు. బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: ఏ.ఎస్.ప్రకాష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, సినిమాటోగ్రఫీ: ఆర్ధర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, యాక్షన్: పీటర్ హైన్స్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్, నిర్మాత: అభిషేక్ నామా, రచన-దర్శకత్వం: శ్రీవాస్!