‘మిస్సమ్మ’, ‘అనసూయ’ లాంటి చిత్రాలతో ఆకట్టుకుంది భూమిక. పవన్ కల్యాణ్ సరసన ‘ఖుషీ’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత బాలీవుడ్, కోలీవుడ్ లలో కూడా పలు సినిమాల్లో నటించింది భూమిక. అయితే నటిగా బిజీగా ఉన్న సమయంలోనే యోగా మాస్టర్ భరత్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
రీసెంట్గా ధోని బయోపిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఎంఎస్ ధోని అన్ టోల్డ్ స్టోరితో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ధోనికి అక్కగా నటించి మెప్పించింది. తాజాగా ఎంసీఏలో నానికి వదినగా కనిపించిన భూమిక ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీలో కీలకపాత్రలో పోషించిన భూమిక తన పాత్రకు వందశాతం న్యాయంచేసింది.
ఈ నేపథ్యంలో భూమికకు మరో ఆఫర్ వచ్చింది. నాగచైతన్య..చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చైతూకు అక్కయ్యగా మారిపోయింది. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తమిళ హీరో మాధవన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో కూడా భూమిక పాత్ర చాలా కీలకంగా ఉండనుందట. ఇటీవలె చైతూ-భూమికల మధ్య కీలకసన్నివేశాలను కూడా తెరకెక్కించారు. మొత్తంగా సెకండ్ ఇన్నింగ్స్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది ఈ మిస్సమ్మ.