షార్ట్ ఫిలిం దర్శకుడు ముత్యాల యోగికుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు అసభ్య మెసేజ్‌లు పంపిస్తున్నాడని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హారిక పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలు హారిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు యోగేశ్‌పై గచ్చిబౌలి పోలీసులు సెక్షన్ 354ఏ, 354బీ, 606 కింద కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు.
అరెస్టైన కొద్దిసేపట్లోనే మియాపూర్ కోర్టు యోగికి బెయిల్ మంజూరు చేసింది. అయితే, అరెస్ట్ చేసే ముందు హైడ్రామా చోటుచేసుకుంది. తాను ఏ తప్పు చేయలేదంటూ నిందితుడు యోగి.. పోలీసులు కొన్ని మొబైల్ స్క్రీన్ షాట్లు పంపించాడు. హారిక తనకు పంపిన మెసేజ్‌లను స్క్రీన్ షాట్లు తీశాడు. నేను వ్యక్తిగతంగా ఆనందంగా లేను. జీవితంపై నాకు విసుగొచ్చింది. విదేశాల్లో ఎంజాయ్ చేయాలని ఉంది. సంతోషంగా లేనప్పుడు విలువలు ఎందుకు పాటించాలని ఈ మెసేజుల్లో ఉంది. అయితే ఈ మెసేజ్‌లపై పోలీసులు ఎలా స్పందిస్తారు అన్న విషయం తెలియాల్సి ఉంది.
విచారణ సమయంలో యోగిని అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి బూటుకాలితో తన్నిన దృశ్యాలు టీవీ చానళ్లలో రావడంతో ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.