డైరెక్టర్‌ కే టెస్ట్‌ పెడుతున్న హీరో..!

201
- Advertisement -

మీరు చదివింది కరక్టే..! డైరెక్టర్‌కే ఓ హీరో టెస్ట్‌ పెడుతున్నాడు. నిజానికి డైరెక్టరే నటీనటులకు టెస్ట్‌ (ఆడిషన్‌) పెడుతుంటారు కాదా ఇక్కడేంటి రివర్స్‌ లో జరుగుతోంది అనుకుంటున్నారా..? టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఓ కొత్త దర్శకుడు చెప్పిన బాక్సింగ్ నేఫథ్యపు కథకి కనెక్టయ్యాడు. కథ సంగతి సరే, మరి సినిమాని ఎలా తీయగలడు, ఏ మేరకు తీయగలడు అనేది కూడా ఇంపార్టెంటే కదా. ఇదే డౌట్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కి వచ్చింది. ఎందుకంటే, ఆ కొత్త దర్శకుడు చెప్పిన కథకి కనెక్టయ్యింది బన్నీనే.

 tollywood star hero test for director skills

అందుకే బన్నీ సినిమాతో డైరెక్టర్‌ గా ముద్ర వేసుకోడానికి ట్రై చేసే కొత్త డైరెక్టర్‌ అనురెడ్డికి బన్నీ టెస్ట్‌ పెడుతున్నాడట. అందుకోసం ఓ టెస్ట్ షూట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ టెస్ట్ షూట్ లో బన్నీ వుండడు. వేరే కొన్ని సీన్లు ఎలా తీయాలనుకుంటున్నావో, ఏలా తీస్తావో తీసి చూపించు అని బన్నీ ఆ కొత్త డైరక్టర్ కు అన్ని సదుపాయాలు ఇచ్చి పంపినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కథ చెప్పి బన్నీ ముందు పాస్‌ అయిన ఆ డైరెక్టర్‌..ఇప్పుడు బన్నీ పెట్టిన మూవీ టేకింగ్‌ టెస్ట్‌లో కూడా పాస్‌ అవుతాడా..? చూడాలి మరి. ఒకవేల బన్నీ పెట్టిన టెస్ట్‌లో ఆ డైరెక్టర్‌ పాసైతే గనుక …వక్కంతం వంశీ డైరక్షన్ లో సినిమా పూర్తి చేసిన వెంటనే ఆ డైరెక్టర్‌ తో బన్నీ మూవీ స్టార్ట్‌ చేస్తాడని టాక్‌.

- Advertisement -