ఆదర్శం ఆ సర్పంచ్‌

165
sarpanch
- Advertisement -

నన్ను గెలిపిస్తే ఊరికి రోడ్లేయిస్తా.. కరెంట్ సౌకర్యం తెప్పిస్తా.. నీటి సమస్య లేకుండా చేస్తా ఇలాంటి వాగ్దానాలు సర్పంచ్ ఎన్నికల్లో చాలానే చూసి ఉంటాం. కానీ ఈ సర్పంచ్ ఏం చేశాడో తెలుసా? ఊరి డ్రైనేజీ సమస్యను పరిష్కరించడానికి తానే పారిశుద్ధ్య కార్మికుడిగా మారాడు. ఊరి సర్పంచ్ ఏంటి.. పారిశుద్ధ్య కార్మికుడిగా మారడం ఏంటని అనుకుంటున్నారా.. అవును నేను చెప్పేది నిజం.. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రెడ్డి నాయక్ పెద్దతండాలో జరిగింది.

పైన ఫోటోలో డ్రైనేజీలో దిగి పని చేస్తున్న వ్యక్తి పేరు భూక్యా రఘు నాయక్.. అసలు విషయానికి వస్తే… ఆ గ్రామానికి రావలసిన నిధులు రాలేదు. వచ్చిన నిధులు… తాగునీటి అవసరాలకు ఖర్చుపెట్టారు. దీంతో ఖజానా ఖాళీ అయిపోయింది. పన్నులు వసూళ్లు కూడా పెద్దగా లేవట, కానీ ఊర్లో డ్రైనేజీ సమస్య పెద్దదవడంతో..ప్రజలు పదే పదే ఈ సమస్యపై సర్పంచ్‌కు విన్నవించుకోవడంతో… జీతమిచ్చి కార్మికున్ని నియమించుకోలేక ఇలా తానే కార్మికుడై డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపాడు. ఓట్లకు ముందు అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి చివరకు గెలిచిన తర్వాత మొహం చాటేసే నాయకులున్న ఈరోజుల్లో..నమ్మి ఓటేసిన ప్రజలకోసం మురికి కాలువలో దిగి పని చేసి నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్న ఈ సర్పంచ్‌ను నిజంగా మనం మెచ్చుకోవాల్సిందే..

- Advertisement -