చికిత్సకు స్పందిస్తున్న జయలలిత…

205
- Advertisement -

తమిళనాడు ముఖ్యమంత్రి జయలిలత ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జయలలితకు చికిత్స కొనసాగుతోంది. జయలలిత కోలుకుంటున్నారని….చికిత్సకు స్పందిస్తున్నారని అపోలో ఆస్పత్రి వర్గాలు ఆదివారం రాత్రి ప్రకటించాయి. ఆమె ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశాయి. డాక్టర్‌ రిచర్డ్‌ నేతృత్వంలో వైద్యులు ఆమెకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆమె ఆరోగ్యానికి సంబంధించి జరిపిన పలు పరీక్షలను డాక్టర్‌ రిచర్డ్‌ మదింపు వేస్తున్నారని ప్రకటనలో తెలిపారు.

అనారోగ్యంతో జయలలిత సెప్టెంబరు 22న చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.అప్పటి నుంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అపోలో సంస్థల ఛైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి రెడ్డి స్వయంగా వైద్యసేవలను పర్యవేక్షిస్తున్నారు. జయలలిత ఆరోగ్యంపై వస్తున్న వదంతులతో మనస్తాపానికి గురైన ఏఐడీఎంకే కార్యకర్త ముత్తుస్వామి (47) గుండెపోటుతో ఆదివారం కన్నుమూశారు.

jayalalitha-hospitalized

జయలలిత ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని అమ్మ అభిమానులను కోరుకుంటున్నారు. ఆసుపత్రి వద్ద అన్నాడీఎంకే మహిళా కార్యకర్తాలు అమ్మ ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క జయలలిత తొందరగా కోలుకోవాలని అభిమానులు పూజలు నిర్వహించారు. మరోవైపు జయలలిత ఆరోగ్యంపై పుకార్లు కొనసాగుతున్నాయి. ఆగడం లేదు. సోషల్ మీడియాలో జయ ఆరోగ్యంపై పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే అమ్మకు సంబంధించిన ఒక ఫొటో వైరల్‌గా మారింది.

Jayalalitha

జయలలిత ఆసుపత్రి బెడ్ పైన ఆక్సిజన్‌ మాస్క్‌ పెట్టుకుని చికిత్స తీసుకుంటున్నట్లు ఉన్న ఫొటో ఒకటి నెట్లో చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆ ఫొటోను అనేకమంది షేర్‌ చేస్తున్నారు. అయితే ఆ ఫొటో ఇప్పటిది కాదని. అమ్మ ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందొద్దని, కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు.

- Advertisement -