రామచంద్ర మిషన్ ను సందర్శించిన కోవింద్‌..

215
President visit to Ramachandra Mission
- Advertisement -

శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాదులో బస చేస్తున్న భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నేడు (సోమవారం) నందిగామ మండలం చేగూరు గ్రామంలోని రామచంద్ర మిషన్ ను సందర్శించారు. ఈ సందర్బంగా రాష్ట్రప్రతి స్పెషల్ హెలికాప్టర్ లో రాష్ట్ర్రపతి నిలయం, బొల్లారం నుండి బయలుదేరి ఉదయం 10 .55 గంటలకు చేగూరు రామచంద్ర మిషన్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలిపాడ్ ను చేరుకొన్నారు.

అక్కడ ఆయనకు హైదరాబాద్ కలెక్టర్ యోగితా రానా, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సందీప్ శాండిల్య తో పాటు ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడినుండి రాష్ట్రపతి రామచంద్ర మిషన్ వారి కన్హా శాంతి వనాన్ని సందర్శించారు.

 President visit to Ramachandra Mission

రామచంద్ర మిషన్ మాస్టర్ కమలేష్ పాటిల్ తో పాటు సుమారు గంట పాటు ధ్యాన మందిరంలో గడిపారు. పిదప రాష్ట్రపతి శాంతి వనం లో ఒక నాగవల్లి మొక్క ను నాటి రాష్ట్రపతి నిలయానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి తో పాటు గవర్నర్ నరసింహన్ కూడా పాల్గొన్నారు.

- Advertisement -