ఆదివారం ఉత్కంఠభరితంగా చివరిదైన మూడో టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. లంక పోరాడినా ఓటమి తప్పలేదు. ఉనద్కత్ (2/15), హార్దిక్ పాండ్య (2/25), వాషింగ్టన్ సుందర్ (1/22)ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మొదట శ్రీలంకను 135/7కే పరిమితం చేసిన భారత్.. ఛేదనలో తడబడింది. మనీష్ పాండే (32; 29 బంతుల్లో 4×4), శ్రేయస్ అయ్యర్ (30; 32 బంతుల్లో 1×4, 1×6), రోహిత్ (27; 20 బంతుల్లో 4×4, 1×6) రాణించడంతో 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జయ్‌దేవ్ ఉనద్కత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.
శ్రీలంక ఇన్నింగ్స్: డిక్వెలా (సి) సిరాజ్ (బి) ఉనద్కత్ 1; తరంగ (సి) పాండ్య (బి) ఉనద్కత్ 11; కుశాల్ పెరీరా (సి) అండ్ (బి) సుందర్ 4; సమరవిక్రమ (సి) కార్తీక్ (బి) పాండ్య 21; గుణరత్నె (సి) కుల్‌దీప్ (బి) పాండ్య 36; గుణతిలక (సి) పాండ్య (బి) కుల్‌దీప్ యాదవ్ 3; థిసార పెరీరా (సి) రోహిత్ (బి) సిరాజ్ 11; శనక నాటౌట్ 29; ధనంజయ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 135;
వికెట్ల పతనం: 1-8, 2-14, 3-18, 4-56, 5-72, 6-85, 7-111;
బౌలింగ్: వాషింగ్టన్ సుందర్ 4-0-22-1; ఉనద్కత్ 4-0-15-2; సిరాజ్ 4-0-45-1; పాండ్య 4-0-25-2; కుల్‌దీప్ 4-0-26-1
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) కుశాల్ పెరీరా (బి) శనక 27; రాహుల్ ఎల్బీ (బి) చమీర 4; శ్రేయస్ అయ్యర్ రనౌట్ 30; మనీష్ పాండే (బి) చమీర 32; హార్దిక్ పాండ్య (సి) డిక్వెలా (బి) శనక 4; దినేశ్ కార్తీక్ నాటౌట్ 18; ధోని నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు 8 (19.2 ఓవర్లలో 5 వికెట్లకు) 139;
వికెట్ల పతనం: 1-17, 2-39, 3-81, 4-99, 5-108;
బౌలింగ్: ధనంజయ 4-0-27-0; చమీర 4-0-22-2; థిసార పెరీరా 3.2-0-22-0; ప్రదీప్ 4-0-36-0; శనక 4-0-27-2