హిమాచల్ ప్రదేశ్ సీఎంగా ఠాకూర్..

205
- Advertisement -

హిమాచల్ ప్రదేశ్ సీఎంగా ఐదుసార్లు ఎమ్మెల్యే జైరామ్ ఠాకూర్ ఎంపికయ్యారు. జైరామ్ ఠాకూర్ ను ఎంపిక చేసినట్టు కేంద్ర మంత్రి, పార్టీ కేంద్ర పరిశీలకుడు నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. ఇవాళ జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి బీజేపీ కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్ హాజరయ్యారు.

BJP Selected Jairam Tagore As A Himachal Pradesh CM

ఈ సందర్భంగా తోమర్ మాట్లాడుతూ, రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా జైరామ్ ఠాకూర్ బాధ్యతలు చేపట్టనున్నట్టు చెప్పారు. కాగా, బీజేపీ సీనియర్ నేత అయిన ఠాకూర్ వయసు 52 సంవత్సరాలు. గతంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా, మంత్రిగా ఆయన పని చేశారు.

ఇక సోమవారమే ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రానున్నారు. రేపు లేదా బుధవారం ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇదిలా ఉండగా.. సీఎంగా తనను ప్రకటించిన తర్వాత మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ జైరామ్ ఠాకూర్ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -