నాని, సాయిపల్లవి నటించిన ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) యావరేజ్ టాక్ తో నడుస్తోంది. నిర్మాత దిల్ రాజుకు మాత్రం సినిమా కాసుల పంట పండించేసింది అని టాలీవుడ్ వర్గాలంటున్నాయి. అయితే, సినిమా సెకండాఫ్ కొంత వీక్ అవ్వడానికి అసలు కారణం ఆలస్యంగా వెలుగు చూసింది. హీరో నాని ఒత్తిడితో, ఎంసీఏలో సాయిపల్లవి నటించిన నాలుగు సీన్స్ ను కట్ చేసినట్లు సమాచారం. నిజానికి సాయిపల్లవి తన నటనతో, సెట్స్ లోనే అందరినీ కట్టి పడేసిందట. నిజానికి కట్ చేసిన పల్లవి సీన్స్ కనుక సెకండ్ హాఫ్ లో పడి ఉంటే, సినిమా సూపర్ హిట్ అయి ఉండేదని, యూనిట్ సభ్యులు అంటున్నారు.
మూవీ ఫస్ట్ రఫ్ ఎడిటింగ్ అయిన తర్వాత చూస్తూ, మూవీ మొత్తం సాయిపల్లవి ముద్ర కనబడిందట. దీంతో ఖంగుతిన్న నాని, పల్లవి సీన్స్ కట్ చేయాల్సిందేనని, చేయకపోతే, తర్వాతి సినిమాలకు సైన్ చేయనని దిల్ రాజును ఒత్తిడి చేశాడట. కనీసం ప్రథమార్ధంలో సాయిపల్లవికి అంతో ఇంతో రోల్ ఉంది కానీ.. ద్వితీయార్ధంలో ఆమె పాత్రకు ఏమాత్రం స్కోప్ ఇవ్వలేదు. ఈ సినిమాలో సాయిపల్లవి నటిగా పెద్దగా చేసిందేమీ లేదు. కేవలం డ్యాన్సుల వరకు ఆమెను బాగా వాడుకున్నారు. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన సాయిపల్లవి.. ఫ్యామిలీ పార్టీ.. ఏవండోయ్ నాని గారూ పాటల్లో డ్యాన్సులు అదరగొట్టేసింది. కానీ సాయిపల్లవి నుంచి జనాలు ఆశించేది అది కాదు. ఆమె మార్కు నటన. అంత టాలెంటెడ్ నటిని సరిగ్గా ఉపయోగించుకోవడంలో దర్శకుడు వేణు శ్రీరామ్ విఫలమయ్యాడు.