- Advertisement -
శీతాకాల విడిదికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట్ ఎయిర్‌పోర్టులో కోవింద్‌కు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు, సీఎం కేసీఆర్, శాసనసభా స్పీకర్ మధుసూదనా చారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌లు ఘన స్వాగతం పలికారు.
కోవింద్ విడిది కోసం రాష్ట్రపతి భవన్ ముస్తాబైంది. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో 4 రోజుల పాటు కోవింద్ విడిది చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగే గవర్నర్ విందుకు రాష్ట్రపతి హాజరుకానున్నారు. 26 డిసెంబర్ రోజు రాష్ట్రపతి భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించనున్నారు.
- Advertisement -