దండుపాళ్యం దర్శకుడితో శర్వా..

275
Dandupalyam director with Sharwa
- Advertisement -

టాలీవుడ్ టాప్ హీరోలతో పోటీ పడుతూ మార్కెట్‌ రేటును అంతకంతకూ పెంచుకుంటున్నాడు యంగ్ హీరో శర్వానంద్. ఇటీవల మహానుభావుడు మూవీతో హిట్ కొట్టిన శర్వా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం స్వామిరారా, కేశవ లాంటి వైవిధ్యభరిత చిత్రాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

ఈ మూవీలో శర్వానంద్.. యువకుడిగా.. మధ్య వయస్కుడిగా డ్యుయల్ రోల్‌లో కనిపించబోతున్నాడు. అర్జున్ రెడ్డి మూవీతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించిన షాలిని పాండేని ఇప్పటికే ఓకే చేయగా.. తాజాగా జైలవకుశ, జెంటిల్మన్, నిన్నుకోరి, చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నివేదా థామస్‌‌ను శర్వా సరసన నటించేందుకు ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. హారిక- హాసిని బ్యానర్‌లో ప్రముఖ నిర్మాత రాధాక్రిష్ణ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Dandupalyam director with Sharwa
దీంతో పాటు హను రావిపూడి దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయిన శర్వానంద్ తాజాగా కన్నడ దర్శకుడితో మరో మూవీకి కమిట్ అయ్యాడు. దండుపాళ్యం హిట్ సిరీస్‌లతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న  శ్రీనివాసరాజుతో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

హను రావపూడి ,సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రాల తర్వాత ఈ సినిమాను పట్టాలెక్కించనున్నాడు.  ఇప్పటివరకు శర్వానంద్ ఈ తరహా పాత్రలో కనిపించలేదట. మరి ఇంతగా శర్వాను ఎగ్జైట్ చేసిన సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

- Advertisement -