భావన… శుభలేఖ వచ్చేసింది

246
Bhavana’s marriage was fixed
- Advertisement -

హీరోయిన్ భావన పెళ్లి తేదీ ఖరారైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేసిన ఈ నటి.. చిరకాల మిత్రుడు, శాండిల్ వుడ్ ప్రొడ్యూసర్ నవీన్ ను పెళ్లిచేసుకోబోతోంది. జనవరి 22న వీళ్ల వివాహం బెంగళూరులో జరుగుతుంది. త్రిసూర్ లోని ‘లలు కన్వెన్షన్ సెంటర్’ వేదికగా వీరు ఒక్కటికానున్నారు. ఈ మేరకు ఇప్పటికే సన్నిహిత మితృలకు, బంధువులకు ఆహ్వానాలు అందాయి.

ఈ ఏడాది మార్చి 9న కేరళలో వీరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.  ఈ వేడుకకు సినీప్రముఖులు ఎవర్నీ ఆహ్వానించలేదు. పెళ్లిని కూడా సినీ పరిశ్రమకు దూరంగా జరుపుకోవాలని భావన భావిస్తోంది. కేవలం కొంతమంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో సింపుల్ గా పెళ్లి చేసుకోవాలని అనుకుంటోంది.

Bhavana’s marriage was fixed
భావనపై లైంగిక వేధింపుల కేసు కేరళ చిత్రపరిశ్రమను ఓ ఊపుఊపింది. మల్లూవుడ్ స్టార్ దిలీప్ అరెస్టయి, 85రోజులు జైలుజీవితం గడిపింది కూడా ఈ కేసుపైనే. ప్రస్తుతం ఈ కేసు నడుస్తోంది. ఆ ఘటన జరిగిన వెంటనే నిశ్చితార్థం చేసుకుంది భావన. తర్వాత బయట పెద్దగా కనిపించలేదు. సినిమాలు కూడా తగ్గించేసింది.

2002లో భావన ఓ మలయాళ చిత్రంలో నటిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ్, కన్నడ సిమాల్లో నటించారు.

Bhavana’s marriage was fixed

- Advertisement -