అదేంటి సచిన్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పి చాలకాలం అయింది మళ్లీ డకౌట్ ఏంటీ అనుకుంటున్నారా..మీరు చదివింది నిజమే కానీ సచిన్ డకౌట్ అయింది క్రికెట్‌లో కాదు రాజ్యసభలో. ఐదేళ్ల తర్వాత తొలిసారి రాజ్యసభలో గళం విప్పేందుకు వచ్చిన మాస్టర్ బ్లాస్టర్‌కు నిరాశే ఎదురైంది.
షార్ట్ నోటీసు కింద క్రీడారంగంపై మాట్లాడేందుకు సచిన్ ప్రిపేరై వచ్చారు. కానీ సచిన్‌కు సొంతపార్టీ నుంచి మద్దతు లభించలేదు. మన్మోహన్‌పై గుజరాత్ ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. వారి అరుపులు,కేకలతో రాజ్యసభ దద్దరిల్లిపోయింది. దీంతో సచిన్ మాట్లాడలేక పోయారు.
చైర్మన్ వెంకయ్యనాయుడు జోక్యం చేసుకున్న సభ్యులు శాంతించలేదు. క్రీడల గురించి మాట్లాడుతుంటే వినరా అంటూ సభ్యులపై ఆవేశాన్ని వ్యక్తం చేశారు. యువ క్రీడాకారులు సచిన్‌ను స్ఫూర్తిగా తీసుకుంటారని … భారత రత్న అందుకున్న వ్యక్తి క్రీడల గురించి మాట్లాడుతుంటే ఆయన్ను అడ్డుకుంటారా అంటూ వెంకయ్య సీరియస్ అయ్యారు. అయితే నినాదాలు ఆగకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు.
Rajya Sabha Winter Session – 244| December 21, 2017| Time Slot: 14.00 to 14.16: https://t.co/MEChJyLkdS via @YouTube
— Rajya Sabha TV (@rajyasabhatv) December 21, 2017