రివ్యూ: ఎంసీఏ

556
Mca Review
- Advertisement -

నాచురల్ స్టార్ నాని, సాయిపల్లవి హీరో,హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం  ‘ఎంసీఏ’ (మిడిల్ క్లాస్ అబ్బాయి). శ్రీరామ్ వేణు దర్శకత్వంలో  దిల్ రాజు నిర్మాతగా క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చింది.  రాజీవ్ కనకాల, భూమిక, ఆమని, నరేష్ లాంటి సీనియర్ నటులతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది…? నాని మరోసారి మ్యాజిక్ చేశాడా…? దిల్ రాజు, నాని డబుల్ హ్యాట్రిక్ కొట్టారా లేదా చూద్దాం….

కథ:

నాని మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడు. తల్లి చిన్నతనంలో చనిపోవడం వల్ల అన్నయ్య (రాజీవ్ కనకాల) అతనికి సర్వస్వం. అన్నయ్య జీవితంలో జ్యోతి (భూమిక చావ్లా) భార్యగా ప్రవేశించడంతో కొంత వారి మధ్య దూరం పెరుగుతుంది. వదిన కారణంగానే అన్నయ్య దూరమయ్యాడనే ఫీలింగ్‌లో ఉంటాడు నాని. ఇంతలో అన్నయ్య ఢిల్లీకి వెళ్లడం, రవాణాశాఖలో పనిచేసే జ్యోతికి వరంగల్ ట్రాన్స్‌ఫర్ కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో నాని కూడా వదినతో అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ కొన్ని సమస్యల్లో చిక్కుకుంటుంది. ఆ సమస్యల నుంచి భూమికను  నాని ఎలా గట్టెక్కించాడు…?ఆ సమస్య ఏంటి అనేది తెరమీద చూడాల్సిందే.

Mca Review
ప్లస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ నాని,సాయిపల్లవి నటన….ఫస్టాఫ్,కామెడీ. నాని తన సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ముఖ్యంగా ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిలా నాని నటన ఆకట్టుకుంటుంది. ఫిదా ఫేమ్ సాయిపల్లవి సినిమాకు మరో ప్లస్. పల్లవి పాత్రలో అల్లరి, చిలిపి పాత్రలో ఆకట్టుకొంటుంది. ఇక పాటల్లో డ్యాన్సులతో దుమ్ము దులిపేసింది. పోసాని,రాజీవ్ కనకాల,భూమిక,నరేష్,ఆమని తమపరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ప్రియదర్శి  కామెడీ సూపర్బ్. డైలాగులు పేలాయి.

మైనస్ పాయింట్స్‌:

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ మ్యూజిక్‌,సెకండాఫ్‌,రోటిన్ కథ. స్క్రీన్ ప్లే కూడా అంతగా ఆకట్టుకోదు.సెకండాఫ్‌లో కథ గురించి కొంత మరింత జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఎంసీఏ బ్లాక్‌బస్టరే అయి ఉండేదేమో.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. ఫస్టాఫ్ అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు వేణు కొన్నిచోట్ల తడబడ్డాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సమీర్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సీన్స్‌ అద్బుతంగా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. దిల్ రాజు నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

Mca Review
తీర్పు:

ఓ మై ఫ్రెండ్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన దర్శకుడు వేణు శ్రీరాం.  ఐదేళ్ల తర్వాత మధ్య తరగతి కుటుంబంలో ఉండే బంధాలు, అనుబంధాలతో ఎంసీఏగా ప్రేక్షకుల ముందుకువచ్చాడు. నాని,సాయిపల్లవి నటన,కామెడీ సినిమాకు ప్లస్ కాగా రోటిన్ కథనం,మ్యూజిక్ మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా సెకండాఫ్‌పై కాస్త దృష్టిపెడితే అందరికి నచ్చే మూవీ ఎంసిఏ.

విడుదల తేదీ:21/12/2017
రేటింగ్:2.5/5
నటీనటులు:నాని,సాయి పల్లవి
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
నిర్మాత:దిల్ రాజు
దర్శకత్వం:వేణు శ్రీరాం

- Advertisement -