భయపడేవాడెప్పుడూ రౌడీ కాలేడు…

225
- Advertisement -

సినిమాల కన్నా సంచలన వ్యాఖ్యలతోనే వార్తల్లో ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన విజయవాడ నేపథ్యంగా వంగవీటి సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ను ఆయన ఈరోజు విడుదల చేశారు.’ఒకప్పుడు విజయవాడలో.. భయపడేవాడెప్పుడూ రౌడీ కాలేడు’ అంటూ రక్తం పులుముకున్న టైటిల్స్.. ‘వంగవీటి.. వంగవీటి.. వంగవీటి.. వంగవీటి కత్తి.. ఇది కాపును కాసే శక్తి.. కమ్మని పౌరుషాసుకి పుట్టిస్తుంది భయమూ భక్తి..’ అంటూ బ్యాక్ గ్రౌండ్ లో రాంగోపాల్ వర్మ గంభీర స్వరం.. కత్తులతో పోరాటం.. నెత్తుటితో సమాధానం.. చివరికి ఏం మిగిలిందనేది తెరపై చూడమంటూ టీజింగ్..

vangaveeti

‘వంగవీటి’ టైటిల్ కి ‘కాపు కాసే శక్తి’ అనే ట్యాగ్ లైన్ తో ఉన్న ఈ సినిమా ‘గాంధీ జయంతి శుభాకాంక్షలతో నేటి సాయంత్రం 5 గంటలకి ట్రైలర్ విడుదల..ఓం శాంతిః’ అంటూ వర్మ పోస్ట్ చేశారు. కాగా, ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ ను వర్మ నిన్న విడుదల చేశారు. ‘వంగవీటి’ని రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా  ట్రైలర్ మీకోసం..

- Advertisement -