త్రివిక్రమ్‌కు జోహార్లు…

553
Pawan praises Trivikram
- Advertisement -

హైదరాబాద్ నోవాటెల్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్‌ ఘనంగా జరిగింది. భారత్ మాతాకీ జై అంటూ పొలిటికల్ సినిమాటిక్ గా ప్రసంగం స్టార్ట్ చేసిన పవన్ త్రివిక్రమ్‌ పై ప్రశంసల జల్లు కురిపించారు.  తనకు త్రివిక్రమ్ శ్రీనివాస్ సలహాలు ఇస్తుంటారని, ఏదేదో అంటుంటారని, కానీ తనను చాలామంది ఒంటరి చేసేసినపుడు, పరాజయాల సమయంలో తనతో ఎవరూ లేనపుడు, త్రివిక్రమ్ అండగా నిలిచారని చెప్పుకొచ్చారు.

ఎవర్నీ కోప్పడలేను కానీ, త్రివిక్రమ్ ను కొప్పడగలను అన్నారు. అంత సాన్నిహిత్యం వుందన్నారు. తనకు బలంగా అండగా నిలబడిన వ్యక్తి త్రివిక్రమ్ అన్నారు. అందుకే ఆయనకు మనస్పూర్తిగా జోహార్లు అర్పిస్తున్నా అన్నారు. అయితే వాస్తవానికి జోహర్లు అనే పదం చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ వాడుతుంటారు. కానీ పవన్‌…త్రివిక్రమ్‌కు జోహార్లు అంటూ అనడం వెనుక అంతర్యం ఎవరికి  అర్ధం కాలేదు.

పవన్ కల్యాణ్ కూర్చుని ఉండగా తాను మాట్లాడటమనేది సునామీలో పిల్లనగ్రోవి వాయించడం లాంటిదని ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి చమత్కరించారు.  దర్శకుడు త్రివిక్రమ్ సంధించి విసిరిన కల్యాణాస్త్రం అని, పవనాస్త్రం అని.. ఈ సినిమా కలెక్షన్ల సునామీ సాధిస్తుందని కోరుకుంటున్నానని అన్నారు.

సినీ నటి ఖుష్బూ మాట్లాడుతూ, పదేళ్ల తర్వాత తాను తెలుగు సినిమాలో మళ్లీ నటిస్తున్నానని, తనకు చాలా సంతోషంగా ఉందని, తెలుగులో తన చివరి చిత్రం  స్టాలిన్  అని అన్నారు. ఈ పదేళ్లలో తనకు చాలా ఆఫర్లు వచ్చాయని, అయితే ప్రాముఖ్యత ఉన్న సినిమాల కోసం ఎదురు చూశానని చెప్పారు. అజ్ఞాతవాసి  చిత్రంలో తాను నటిస్తే బాగుంటుందని దర్శకుడు త్రివిక్రమ్ చెప్పడంతో, తాను తిరస్కరించలేకపోయానని అన్నారు.

2018లో రాబోతున్న బ్లాక్ బస్టర్ హిట్  అజ్ఞాతవాసి  అని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు.  కల్యాణ్ గారికి త్రివిక్రమ్ తోడైతే  జల్సా ,  అత్తారింటికి దారేది ..ఇప్పుడు  అజ్ఞాతవాసి  బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది  అని అన్నారు.

- Advertisement -