ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ ముంబయిలో సందడి చేశారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘బ్రైట్’ చిత్రం డిసెంబర్ 22న భారత్‌లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాల నిమిత్తం విల్‌స్మిత్ భారత్ చేరుకున్నారు. విల్ స్మిత్‌తో పాటు మరో నటుడు జోయెల్ ఎడ్‌గెర్టాన్ కూడా ముంబయిలో సందడి చేశారు. విల్‌స్మిత్ భారత్ వచ్చిన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విల్ స్మిత్ మాట్లాడుతూ..భారతీయ చరిత్ర అంటే చాలా ఇష్టమని, భగవద్గీతను తొంభై శాతం చదివానని.. భగవద్గీత చదువుతుంటే నాలో అర్జునుడు ఉన్నట్లు అనిపిస్తుంది. త్వరలో రిషికేశ్ వెళుతున్నా. అక్కడ చాలా రోజులు గడపాలనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు విల్ స్మిత్. భారత్‌పై తనకున్న అనుబంధాన్ని తెలిపారు ఈ హాలీవుడ్ హీరో.
ఇక బాలీవుడ్ గురించి అక్షయ్‌కుమార్‌తో తనకున్న అనుబంధం గురించి మాట్లాడారు.‘బాలీవుడ్‌లో పార్టీలు చాలా గ్రాండ్‌గా జరుపుకొంటారు. నేను ముంబయికి రావడం ఇది మూడోసారి. కానీ భారత్‌కు రావడం నాలుగో సారి. నాకు అక్షయ్‌కుమార్ అంటే చాలా ఇష్టం. ఆయన ఇంట్లోనే ఉండిపోవాలని అనిపిస్తుంది. పోయినసారి ముంబయి వచ్చినప్పుడు అక్షయ్ ఇంట్లోనే డిన్నర్ చేశాను. చాలా రుచికరంగా అనిపించింది. భారత్‌లో నాకు నచ్చిన విషయం అక్షయ్ ఇంట్లో భోజనమే.