- Advertisement -
ఎలాంటి పాత్రలోనైనా సహజంగా నటస్తుంటాడు యంగ్ హీరో నాని. ఈ కారణంగానే నాని పేరుకు ముందు ‘నేచురల్ స్టార్’ అని చేరిపోయింది. ఈ ఏడాది రెండు హిట్లు ఇచ్చిన నాని, మూడవ సినిమా ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’తో ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. “ఏ కథనైనా ఓ ప్రేక్షకుడిగానే వింటాను .. ప్రేక్షకుడిగా సంతృప్తి చెందిన తరువాతనే ఓకే చెబుతాను” అని అన్నారు. ” నేనెప్పుడూ కథ ప్రేక్షకులకు ఎంత దగ్గరలో వుందనే విషయాన్ని గురించి ఆలోచిస్తానే గానీ, స్టార్ డమ్ ను గురించి పట్టించుకోను. హిట్స్ .. ఫెయిల్యూర్స్ కి అతీతుడను అని కూడా అనుకోను. సక్సెస్ వస్తే మరింత బాధ్యత పెరిగినట్టుగానే భావిస్తాను .. ఆ తరువాత సినిమాపై మరింత శ్రద్ధ పెడతాను” అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాతో నాని ఈ ఏడాది హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి.
- Advertisement -