లాయల్ యల్ ఈ డి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన నిరంజన్ పన్సారి 2000 సంవత్సరం నుండి ఎలక్ట్రానిక్ రంగంలో అత్యంత ప్రపంచ ప్రఖ్యాత గాంచిన బ్రాండ్ ‘శ్రీ బాలాజీ వీడియోస్’ ను ద్వారా ఎన్నో విజయవంతమైన తెలుగు చిత్రాలను డిజిటల్ ఫార్మట్ లో అత్యధిక నాణ్యతగల వీడియోస్ ను అందించారు. తొలిసారిగా తెలుగు లో ‘మగధీర’ చిత్రంతో ‘బ్లూ రే’ అందించిన ఘనత కూడా ‘శ్రీ బాలాజీ వీడియోస్’ చెందుతుంది. యూట్యూబ్ ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్లో అతను ఓ మార్గదర్శకుడు, సినిమా ప్రేమికులకు ఇంట్లోనే థియేటర్ లో వీక్షించే అనుభూతిని తమ కంపెనీ ఆడియో మరియు వీడియో అందించగలిగారు.
అటు వీడియో పరిశ్రమలో అగ్రగామిగా నిలిచి 2011 లో లైటింగ్ రంగం లో తక్కువ విద్యుత్ వినియోగించుకుంటూ ఎక్కువ కాంతి నిచ్చే యల్ ఈ డి లైట్స్ వినియోగం పట్ల ఆకర్షితుడై, భారత దేశం ‘మేక్ ఇన్ ఇండియా’ అనే నినాదంతో అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాల సరసన నిలబడుతున్న సందర్భం లో ఆ సందేశానికి మద్దతుగా తొలుత తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో 1500 వివిధరకాల మోడల్స్ తో మనమే సొంత ఎల్ఈడీ పరిశోధన మరియు అభివృద్ధి చేయాలనే సద్దుదేశ్యంతో, ఇక్కడి టెక్నిషియన్స్ సామర్థ్యం తో మరియు కొత్త డిజైన్లను నమూనా అభివృద్ధి చేయడానికి లాయల్ యల్ ఈ డి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, 2009నుండి అమెరికా, ఫ్రాన్సు, ఇటలీ, చైనా, మిడిల్ ఈస్ట్, అరేబియన్ కంట్రీస్ లలో ఇప్పటికే యల్ ఈ డి లైట్స్ తయారీ లో ప్రాచుర్యం పొందిన లో ‘వెల్ కాస్ట్’ కంపెనీ తో కలసి ‘లాయర్ యల్ ఈ డి’ బ్రాండ్ తో భారత దేశం లో తయారు చేయడానికి పరస్పర ఒప్పందం జరిగింది పలు పేటెంట్ ఉత్పత్తులకు సంస్థ అధినేత నిరంజన్ పన్సారి భారత దేశంలో ఉత్త్పతి చేయడానికి అధికారికంగా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా నిరంజన్ పన్సారి మాట్లాడుతూ : “భారత దేశంలో ఇప్పటి వరకు ఈ యల్ ఈ డి బ్రాండ్ లైట్స్ కు ఇవ్వనటువంటి వారంటీ మా ‘లాయల్ యల్ ఈ డి’ బ్రాండ్ లైట్స్ కి మూడు సంవత్సరాల రీప్లేసెమెంట్ వారంటీ ఇస్తున్నాము. డిసెంబర్ ౧౩ వ తేదీ నుండి మా ప్రొడక్ట్స్ ముందుగా హైదరాబాద్ నుండి ప్రారంభించి ఇప్పుడు ప్రత్యేకంగా హైదరాబాద్ లో ప్రారంభించి ఆ తరువాత నెమ్మదిగా తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో మరియు తరువాత భారతదేశం అంతటా బలోపేతం చేయడానికి మా కంపెనీ ప్రణాళిక చేస్తోంది.” అన్నారు.