పంజాబీ సంప్రదాయంలో విరుష్క పెళ్లి..

280
- Advertisement -

కోహ్లీ, అనుష్క ప్రేమాయణం నాలుగేళ్ల నుండి నడుస్తుంది విషయం తెలిసిందే..ఇక ఇప్పుడు వీరు వివాహబంధంతో ఒక్కటికాబోతున్నారు. వీరి వివాహ వేడుకలు జోరుగా సాగుతున్నాయి. కుటుంబసభ్యులు, సన్నిహితులు ఇప్పటికే ఇటలీలోని టస్కనీ నగరానికి చేరుకున్నారు. అయితే ఈ వివాహం పక్కా పంజాబీ సంప్రదాయంలో జరగనుంది. ఇప్పటికే బాంగ్రా డ్యాన్సర్లు, డ్రమ్ములు కూడా ఇటలీకి చేరుకున్నాయి.

Virat Kohli-Anushka Sharma set to marry in Italy

టస్కనీలోని హెరిటేజ్‌ ప్యాలెస్‌లో పెళ్లికి ముందు జరిగే వేడుకల్లో అందరూ ఆనందోత్సాహాలతో పాలుపంచుకుంటున్నారు. ఈ పెళ్లికి క్రికెట్‌ ప్రపంచం నుంచి సచిన్‌, యువరాజ్‌లు హాజరుకానున్న విషయం తెలిసిందే. కోహ్లీ తన పెళ్లికి తొలి ఆహ్వానాన్ని సచిన్‌కే అందించాడు. ఇక అనుష్క తన వివాహ వార్తను అందరికంటే ముందుగా తన తొలి సినిమా నిర్మాత అయిన బాలీవుడ్‌ దర్శకుడు ఆదిత్య చోప్రాకు తెలిపింది. ఆదిత్య, రాణీ ముఖర్జీ వివాహం కూడా ఇటలీలోనే రహస్యంగా జరిగింది. ఇక విరుష్క వివాహ రిసెప్షన్‌ ముంబైలో 26న జరిగే అవకాశాలున్నాయి.

- Advertisement -