పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అజ్ఞాతవాసి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. త్వరలో వారణాసిలో చివరి షెడ్యూల్‌ని జరుపుకోనుంది.
జనవరి 10వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోను ఈ సినిమా అత్యధిక థియేటర్స్ విడుదల కానుండగా సరికొత్త రికార్డును సృష్టించనుంది.
అమెరికాలో ఏకంగా 209 లొకేషన్లలో ఈ చిత్రం విడుదలవుతోంది. ఒక భారతీయ సినిమా యూఎస్ లో ఇన్ని చోట్ల రిలీజ్ కావడం పెద్ద రికార్డుగా చెబుతున్నారు. గతంలో బాహుబలి 126,ఖైదీ నెంబర్ 74,కబాలి 73,దంగల్ 69 రిలీజయ్యాయి.ఇప్పుడు పవన్ అజ్ఞాత వాసి ఆ రికార్డులను చెరిపేయనుంది. త్వరలో ఆడియోని అమరావతిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
త్రివిక్రమ్ పుట్టినరోజున విడుదలైన బయటికొచ్చి చూస్తే లిరికల్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. యూట్యూబ్ లో మొదటి 8 గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ ను దక్కించుకున్న ఈ సాంగ్, ప్రస్తుతం నాలుగు మిలియన్ వ్యూస్‌ని సాధించింది.