కాంగ్రెస్ పార్టీ పై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు ప్రధాని మోదీ. గుజరాత్‌లోని కలోల్ ప్రాంతంలో ప్రచారంలో ఉన్న మోదీ కపిల్ సిబల్‌ను టార్గెట్ చేశారు. సుప్రీంకోర్టులో అయోధ్య వ్యవహారాన్ని మరింత ముందుకు జరపాలని కోరిన కపిల్ సిబల్‌పై కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోదని ప్రశ్నించారు. మణిశంకర్ అయ్యర్‌ను తొలగించినట్లుగా కపిల్ సిబల్‌ను ఎందుకు తొలగించరని అన్నారు.
ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మణిశంకర్ అయ్యర్‌ను తొలగించిన విషయం తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టులో రామ్ మందిర్ విషయం విచారణ జరుగుతున్న సందర్భంలో ఆ కేసును 2019 సాధారణ ఎన్నికలు పూర్తయ్యే వరకు వాయిదా వేయాలంటూ సిబల్ విజ్ఞప్తి చేశారు. దీంతో ఇరుకున పడిన కాంగ్రెస్ ఆయనను గుజరాత్ ఎన్నికల ప్రచారానికి దూరం పెట్టింది.
ఈ నేపథ్యంలో ప్రచారంలో ఉన్న మోదీ… రామ్‌మందిర్‌కు, ఎన్నికలకు సిబల్ ఎందుకు ముడిపెట్టారని ప్రశ్నించారు. మణిశంకర్ మీద తీసుకున్న చర్యలే సిబల్‌పై ఎందుకు కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదని ప్రశ్నించారు.