గుజరాత్ ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతోంది. గెలుపు ఎవరిదా అని అందరు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి బ్రహ్మాస్త్రం దొరికింది. కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్.. ప్రధాని మోడీ నీచ జాతికి చెందిన వ్యక్తి అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇంకేముంది దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మోడీ..కాంగ్రెస్‌పై ఎడా పెడా చెలరేగిపోగలరు. తన ప్రతిస్పందన ద్వారా.. సామాన్యుడి ఆవేశ కావేషాలను ఎలా రెచ్చగొట్టాలో… సామాన్యుడి అభిమానాన్ని, ఉద్వేగాలను తనకు అనుకూలంగా మలచుకోవాలో తెలిసిన మోడీ కాంగ్రెస్ వైఖిరిని ఎండగట్టారు.
‘నీచ’ అనే పదాన్ని ప్రస్తావిస్తు మోడీ రాజకీయాల్లో హిట్ పుట్టిస్తున్నారు. అయ్యర్ మాటలు గుజరాత్ కే అవమానం అంటూ లోకల్ ఫీలింగ్‌ను తట్టిలేపారు మోడీ. కేవలం ప్రచార సభల్లోనే కాదు మోడీకి కలిసివచ్చిన ఆన్లైన్లోను కాంగ్రెస్‌ను తప్పుబడుతు ప్రజల భావోద్వేగాలను అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ వివాదంతో కాంగ్రెస్‌కు మరింత నష్టం జరగకముందే రాహుల్ గాంధీ స్పందించారు. మణిశంకర్ అయ్యర్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాదు ప్రాధమిక సభ్యత్వం నుంచి తప్పించారు. మణిశంకర్ అయ్యర్‌ను తాను సమర్థించడం లేదని, ఆయన ఉపయోగించిన భాష, బాణీని తాను ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించేది లేదని పేర్కొన్నారు. మరోవైపు మణిశంకర్ అయ్యర్ వెనక్కి తగ్గి క్షమాపణలు చెప్పినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
BJP and PM routinely use filthy language to attack the Congress party. The Congress has a different culture and heritage. I do not appreciate the tone and language used by Mr Mani Shankar Aiyer to address the PM. Both the Congress and I expect him to apologise for what he said.
— Rahul Gandhi (@RahulGandhi) December 7, 2017