మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొణిదెల బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్న సినిమా సైరా నరసింహ రెడ్డి..ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే అంచనాలను క్రియేట్ చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తన గ్రాండ్ రీఎంట్రీ తర్వాత ఈ భారీ ప్రాజెక్టును ఎంచుకోవడం విశేషం.. టాలీవుడ్ లో బాహుబలి తర్వాత అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న మూవీ ఇది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నుంచి పలు భాషలకు చెందిన స్టార్స్ ఈ మూవీలో నటిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంపై రూపొందనున్న ఈ బయోపిక్ కోసం సుదీర్ఘ కాలం ప్రీ ప్రొడక్షన్ పనులు జరిగాయి.
అంతేకాదు మెగాస్టార్ సహా నటీనటులు అందరికీ టెస్ట్ షూట్ లు కూడా పూర్తి చేసుకున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఈరోజు ఉదయం 7.30 గంటలకు అధికారికంగా ప్రారంభమైంది. చిరంజీవి.. కేరక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీలపై తొలి షాట్ చిత్రీకరణ చేపట్టారు. హైద్రాబాద్ పరిసరాల్లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మించిన భారీ సెట్ లో ఈ షాట్ చిత్రీకరణ జరిగింది. తొలి షెడ్యూల్ మొత్తం ఇక్కడే షూట్ జరగనుండగా.. చిత్రంలో పలువురు నటీనటులతో పాటు.. ఇంగ్లీష్ యాక్టర్స్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొనున్నారు.
తొలి స్వాతంత్ర్య సమరానికి ముందు కాలం నాటి కథను పరుచూరి బ్రదర్స్ అందించగా.. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. అనేక వాల్యూ ఎడిషన్స్ జరిగాయి. సంగీత దర్శకుడి విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. సౌత్ టాప్ బ్యూటీ నయనతార.. విజయ్ సేతుపతి.. సుదీప్ వంటి భారీ తారాగణంతో సైరా చిత్రం రూపొందనుండగా.. 2019 సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.