ఐష్ కూతురిపై నెటిజన్ కామెంట్స్‌‌..

239
Abhishek Bachchan Strong Counter to Netigen
- Advertisement -

అందాల తార ఐశ్వ‌ర్య‌రాయ్ రీసెంట్‌గా త‌న కజిన్ ప్ర‌జ్వాల్ వెడ్డింగ్‌కి కూతురు ఆరాధ్య‌, త‌ల్లి వ్రిందా రాయ్‌తో క‌లిసి హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. మంగ‌ళూర్‌లో జ‌రిగిన పెళ్ళి వేడుక‌కి ఐశ్వ‌ర్య‌రాయ్ గోల్డ్ ఎంబ్రాయిడ‌రీతో ఉన్న ఎరుపు రంగు లెహంగాని ధ‌రించి హాజ‌రు కాగా, ఆరాధ్య కూడా ఎరుపు రంగు డ్రెస్‌తోనే ద‌ర్శ‌న‌మిచ్చింది. ఇద్ద‌రు ఒకే డ్రెస్‌లో క‌నిపించ‌డంతో ప్ర‌స్తుతం వీరి ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Abhishek Bachchan Strong Counter to Netigen

దీనిపై నెటిజ‌న్స్ కొంద‌రు పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటే, మ‌రి కొంద‌రు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఓ మ‌హిళ ఆరాధ్య గురించి ఎవ‌రు ఊహించ‌ని విధంగా ట్వీట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆరాధ్య స్కూల్‌కి వెళ్లదా ? ఎప్పుడు చూసిన త‌ల్లితో క‌లిసి షికారుకి వెళుతుంటుంది. పాఠ‌శాల యాజ‌మాన్యం ఆరాధ్య‌కి అన్ని సెల‌వులు ఎలా ఇస్తున్నారు. మీ అమ్మాయి అందంగా ఉంటే చాలు చ‌దువు అక్క‌ర్లేద‌ని అనుకుంటున్నారా అని ట్వీట్ పెట్టింది. దీనికి వెంట‌నే ఆరాధ్య తండ్రి అభిషేక్ బ‌చ్చ‌న్ .. మేడం వీకెండ్‌లో అన్ని స్కూల్స్‌కి హాలీడేస్ ఉంటాయి. మిగ‌తా రోజుల‌లో నా కూతురు త‌ప్ప‌కుండా స్కూల్‌కి వెళుతుంది. మా వైపు నుండి అయితే ఎలాంటి త‌ప్పు లేదు, మీ ట్వీట్‌లోనే త‌ప్పు ఉందే చూసుకోండి అంటూ కౌంట‌ర్ ఇచ్చాడు.

- Advertisement -