జనంలోకి.. జ‌న‌సేనాని..

272
- Advertisement -

న‌టుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా రెండు బాధ్య‌త‌ల‌ని స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు నుండి ప్ర‌జా క్షేత్రంలోకి అడుగుపెడుతున్నాడు. నిన్న‌టి వ‌ర‌కు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన అజ్ఞాత‌వాసి చిత్రంతో బిజీగా ఉన్న ప‌వ‌న్‌, ఈ రోజు నుండి జ‌నాల‌లోకి వెళ్ళి వాళ్ళ స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటాడు. రెండు తెలుగు రాష్ట్రాల‌లో మూడు విడుత‌లుగా ప‌ర్య‌ట‌న జ‌ర‌పాడ‌నికి నిశ్చ‌యించుకున్న ప‌వ‌న్‌, ముందుగా విజ‌య‌న‌గ‌రంకి వెళ‌తారు.

ఈ రోజు నుండి 9వ తేదీ వ‌ర‌కు ప‌వ‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్నాడు. అయితే ప‌వ‌న్ త‌న యాత్ర‌కి “చలోరే చలోరే చల్‌”గా నామకరణం చేసి ఓ వీడియో కూడా విడుద‌ల చేశారు. వింటారా.. వెనకాలే వస్తారా? తోడుగా ఉందాం వస్తారా! రండి విందాం అంటూ ప్రారంభమైన ఈ పాటలో ‘మిత్రమా! అసలే చీకటి! ఇల్లేమో దూరం! దారంతా గోతులు! చేతిలో దీపం లేదు. ధైర్యమే ఓ కవచం’ అని పవన్‌ వ్యాఖ్యలతో రూపొందించిన ఈ ప్రత్యేక గీతం అలరిస్తోంది.

Pawan Kalyan begins Political tour again

అయితే ప‌వ‌న్ తొలి ప‌ర్య‌ట‌న మొద‌టి విడత‌లో “సమస్యల పరిశీలన, అధ్యయనం, అవగాహన” కార్యక్రమాలు ఉంటాయి. రెండవ విడతలో “సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఉంటే సరి లేదా పొలిక‌ల్ ఎంట్రీని గుర్తు చేస్తాము” అని ప్రకటించారు. మూడవ విడతలో “సమస్యలు పరిష్కారం కాకుంటే పర్యటనను పోరాట వేదికగా మారుస్తాము” అని పవన్ వెల్లడించారు. ముఖ్యంగా యువ‌తను జాగృతం చేయ‌డానికే ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతుంద‌ని తెలుస్తుంది.

ఈ సందర్భంగా డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్ ఉద్యోగుల దీక్షకు పవన్‌ మద్దతు తెలుపనున్నారు. ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి వెంకటేశ్‌ కుటుంబాన్ని జనసేనాని పరామర్శించనున్నారు. సాయంత్రం జనసైనికుల సమావేశంలో పాల్గొననున్నారు. కృష్ణా నది పడవ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తామని మంగళవారం ఓ ప్రకటనలో పవన్‌కళ్యాణ్‌ తెలిపిన విషయం తెలిసిందే. పోలీసులు ఆంక్షలు సడలించాక వెళ్లి మురళి కుంటుంబాన్ని పరామర్శిస్తానన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం ప్రభుత్వాల విధి అన్నారు. యువత ఆత్మహత్యలకు పాల్పడి వాళ్ల తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చవద్దని, పోరాడి సాధించుకోవాలని చెప్పారు. అందుకు తనతోపాటు జనసేన కూడా అండగా నిలుస్తుందని పవన్ తెలిపారు.

- Advertisement -