మీటింగ్ లో బిజీగా ఉంటే.. అప్పుడు అర్జెంటుగా ఓ మెసేజ్ పెట్టేస్తాం. అంతేకాదు..నిద్రలేస్తూనే గుడ్ మార్నింగ్ తో మొదలుకొని, గుడ్ నైట్ వరకు అన్నీ మెసేజ్ రూపంలోనే సెండ్ చేస్తుంటాం. అయితే..మనషుల మధ్యన ఇంతటి కమ్యునికేషన్ తీసుకొచ్చిన SMS 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1992 డిసెంబర్ 2న పాప్ వర్త్ (22) తొలి ఎస్సెమ్మెస్ ను పంపారు.
కంప్యూటర్ నుంచి వొడాఫోన్ నెట్ వర్క్ కు ‘మేరీ క్రిస్మస్’ అంటూ ఆయన తొలి ఎస్సెమ్మెస్ ను పంపారు. ఈ విషయం ఇటీవలే తన పిల్లలకు చెప్పానని ఆయన అన్నారు. అయితే తాను పంపిన ఎస్సెమ్మెస్ ఇంత ఆదరణ పొందుతుందని అప్పట్లో తాను భావించలేదని ఆయన పేర్కొన్నారు.
1993లో నోకియా సంస్థ తొలిసారిగా ఎస్సెమ్మెస్ పంపుకొనే సౌకర్యం కలిగిన మొబైల్ హ్యాండ్ సెట్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. అయితే ఈ ఎస్సెమ్మెస్ లు ఒకే నెట్ వర్క్ మధ్య బదిలీ అయ్యేవి… 1999లో తొలిసారిగా వేర్వేరు నెట్ వర్క్ ల మధ్య సందేశాలు బదిలీ అయ్యాయి.
Happy 25th birthday SMS! Neil Papworth,who sent the world's 1st text,recreates his Christmas message using emojis LOL pic.twitter.com/Yli4tDakko
— Vodafone Group (@VodafoneGroup) December 3, 2017