పవన్ కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోని ఎంట్రీ ఇచ్చాడు. ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్రప్రభుత్వంపై మాటల దూకుడు పెంచాడు. అయితే పవన్ తీరు ఏపీకిమంచి చేస్తుందా ? పవన్ చెప్పే మాటలు అభిమానులు వింటారా? పవన్ పిలుపుతో ప్రత్యేక హోదాపై.. అభిమానులు వీధుల్లోకి వస్తే ఊరుకుంటారా? అంటే.. అలాంటి పరిస్ధితే వస్తే పవన్ కూడా ఫ్యాన్స్ ను ఆపలేడనే విమర్శలు వినిస్తున్నాయి.
తాజాగా యోయోటీవీకి ఇచ్చి ఇంటర్వ్యూలోనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇలాంటి సంచలన వ్యాఖ్యలే చేశాడు. ప్రత్యేక హోదాపై పవన్ రోడ్డెక్కుతే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుందన్నాడు తమ్మారెడ్డి. పవనిజమంటూ చెలరేగిపోయే ఆయన అభిమానులది ఓ మూర్ఖత్వం అని సంచలన వ్యాఖ్య చేశాడు. పవన్ ఏదైనా ఉద్యమం చేపట్టి రోడ్డు మీదకు వస్తే.. ఆ ఉద్వేగంలో వచ్చే అభిమానులకు పవన్ చెప్పిన మాటలు కూడా వినిపించవని, వారు వినరని చెప్పాడు. దీనికి కాకినాడ సభలో జరిగిన ఘటననే ఉదాహరణ అని తమ్మారెడ్డి తెలిపాడు.
సభ కోసం చెట్లు, ఇళ్లు ఎక్కిన వారిని దిగాల్సిందిగా పవన్ పదే..పదే కోరినా అభిమానులు పట్టించుకోలేదని గుర్తుచేశాడు. పవన్ కన్నా అతడి అభిమానులు.. తనకు విపరీతమైన ఆవేశపరుల్లా కనిపిస్తారన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని 180 నియోజకవర్గాల్లో ప్రతిచోటా పవన్ కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడే 5 వేల మంది అభిమానులు ఉంటారని, వారంతా మిలిటెంట్లు లాంటివారిని తమ్మారెడ్డి అన్నాడు. మంచి జరుగుతుందో లేదా కానీ, వారి ఆవేశంతో చాలా నష్టాలు జరిగే ఆస్కారం మాత్రం ఎక్కువేనన్నాడు. అయితే తమ్మారెడ్డి వ్యాఖ్యలపై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పవన్ గురించి మాట్లాడేంత గొప్పవాడు కాదని చెబుతున్నారు. అయితే తమ్మారెడ్డి వ్యాఖ్యల్లో వాస్తవం లేకపోలేదు అని మరికొందరు విశ్లేషిస్తున్నారు.