మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్..పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ అజ్ఞాతవాసి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జల్సా,అత్తారింటికి దారేది రెండు చిత్రాలు ఘనవిజయం సాధించడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా పవన్‌కు 25వ సినిమా కావడంతో పాటు పవన్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వస్తుండటంతో ఇప్పటికే ప్రిరిలీజ్ బిజినెస్ కూడా స్టార్టయింది.
త్రివిక్రమ్ బర్త్ డే కానుకగా విడుదలైన బయటికొచ్చి చూస్తే సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న వార్తైన బయటికొచ్చిన సెన్సేషన్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో అజ్ఞాతవాసి సినిమాకు సంబంధించిన కథ గురించి టీ టౌన్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
త్వరలో పూర్తిస్ధాయి రాజకీయాల్లోకి రాబోతున్నానని ప్రకటించిన పవన్ రెండు మూడు సినిమాలకు మాత్రమే కమిట్ అయ్యాడు. దీంతో తన చేతిలో ఉన్న సినిమాలతోనే పవన్.. రాజకీయ ఆరంగేట్రం గురించి చెప్పేందుకు ప్లాన్ చేసుకున్నాడట. అందులో ఒకటి దర్శకరత్న దాసరి నారాయణరావు మూవీ ఒకటి. కానీ ఆయన మరణంతో ఈమూవీపై నీలినీడలు కమ్ముకున్నాయి.
దీంతో ఇప్పుడు పవన్..అజ్ఞాతవాసిపైనే భారీ ఆశలు పెట్టుకున్నాడట. అందులో భాగంగానే ఈ సినిమాకు అజ్ఞాతవాసి అనే టైటిల్‌ని ఖరారు చేశారట. ఎందుకంటే ఇండస్ట్రీలో పవన్ మేనరిజం డిఫరెంట్. తనవద్దకు సహాయం కోసం వచ్చిన వారికి లేదనకుండా ఇవ్వడమే కాదు పబ్లిసిటీ కోసం పెద్దగా ఆరాటపడడు. ఇదే పవన్‌కు లక్షలాది ఫ్యాన్స్‌ని సంపాదించి పెట్టింది. దీనికి తోడు సింప్లిసిటీకి కేరాఫ్‌గా ఉండే పవన్..అందరితో ఇట్టేకలిసిపోతాడు. ఇండస్ట్రీలో గొడవలకు దూరంగా ఉంటాడు.
ఈ నేపథ్యంలోనే పవన్ జీవితానికి సంబంధించి ప్రతీ విషయాన్ని దగ్గరి నుంచి చూసిన సన్నిహిత వ్యక్తిగా త్రివిక్రమ్ ఈ సినిమాకు కథను సిద్దం చేశాడట. రాజకీయాలకు సంబంధించి నేరుగా డైలాగులు ఉండకున్న ఓ ఐటీ ఉద్యోగిగా పవన్ చేసే సాయం,తన వ్యక్తిత్వం,ఆలోచనలు ఈ మూవీలో ఉండేలా త్రివిక్రమ్ చూస్తున్నాడట. మొత్తంగా భారీ అంచనాల మధ్య సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానున్న అజ్ఞాతవాసితో పవన్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ కొడతానడంలో ఎలాంటి సందేహం లేదని పలువురు భావిస్తున్నారు.