బయోపిక్ ల సంగతేంటి..?

197
ntr biopics varma and teja
- Advertisement -

టాపిక్ ఏదైనా..టాక్ ఉంటే చాలు.. వాటినో ఇంట్రెస్టింగ్ టాపిక్ లా చూపిస్తూ వార్తలు పుట్టుకొస్తాయి. అవును మరి టాలీవుడ్ లో ఇప్పుడు ఏది ఇంట్రెస్టింగ్ టాపిక్ అనిపిస్తే దానిమీదే వార్తలు రావడం ఖాయం. ఇలాగే..ఆ మధ్య ఎన్టీఆర్ బయోపిక్ గురించి పెద్ద చర్చే జరిగింది. రామ్ గోపాల్ వర్మ సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ ను ప్రకటించగానే వార్తలు గుప్పుమన్నాయి.

 ntr biopics varma and teja

అంతటితో అయిపోలేదు.. బాలయ్య కూడా ఎన్టీఆర్ బయోపిక్ ని చేస్తారని, దాన్ని తేజ డైరెక్టర్ చెయ్యనున్నాడని కూడా వార్తలొచ్చాయి. దాంతో ఎవరి సినిమా ముందుగా రిలీజ్ అవుతుందోననే ఆసక్తి అందరిలోనూ స్టార్టైంది.

కానీ…అప్పట్లో హాట్ హాట్ గా వచ్చేసిన వార్తలు ఒక్కసారిగా కూల్ అయ్యాయి. ఇప్పుడు వర్మ నోట గానీ, తేజ నోటగానీ బయోపిక్ ల మాటే లేదు. అప్పట్లోనే బయోపిక్ గురించి ఆఫ్ ది రికార్డుగా సన్నిహితులతో చెప్తూ వచ్చిన తేజ..ఇప్పుడు వెంకీ సినిమా అయిన తరువాతే ఎన్టీఆర్ బయోపిక్ అంటున్నాడని, ఈ లోపు బాలయ్య కూడా మరో సినిమా చేస్తారని చెప్తున్నట్టు సమాచారం.

ntr biopics varma and teja

ఇక వర్మ విషయానికోస్తే.. లేటెస్ట్ గా వర్మకు నాగార్జునతో కమిట్ అయ్యాడు. ఇక నాగ్ సినిమా మీద కన్నేసిన వర్మ.. ఓ ఆరు నెలలైనా.. ఈ సినిమా పని మీదే వుంటాడు.

ఈ క్రమంలొనే వర్మకు లైఫ్ ఇచ్చిన ‘శివ‘…ఇప్పుడు నాగ్ వల్ల మళ్ళీ లైఫ్ ఇస్తే మాత్రం వర్మకు వరుస ఆఫర్లు ఖాయమనే చెప్పాల్సిందేనేమో. ఇక ఈ హడావిడిలో ఉన్న వర్మ..తేజ ఎన్టీఆర్ బయోపిక్ విషయాన్ని పక్కన పెట్టాశారా..? అసలు ఎన్టీఆర్ బయోపిక్ లు ఇప్పట్లో ఉంటాయా..? అనేది డౌటే. చూడాలి మరి ఎవరు, ఎప్పుడు, ఎలా ప్లాన్, చేస్తారో.

- Advertisement -