ఇప్పుడు అల్లు శిరీష్ తన కొత్త సినిమా ‘ఒక్క క్షణం’తో వస్తున్న సంగతి తెలిసిందే. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ టైటిల్ తో అందరిలో ఆసక్తిని రేకెత్తించిన దర్శకుడు వి.ఐ. ఆనంద్. ఆ సినిమాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు తన తదుపరి సినిమా ‘ఒక్క క్షణం’తోనూ అయన అదే స్థాయిలో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాడు. అల్లు శిరీష్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు.
ఆల్రెడీ రెండు వెలగని అగ్గిపుల్లలను టైటిల్లో చూపించి.. సినిమాలో లవ్ వర్సెస్ డెస్టినీ అంటూ ఏదో ఉందని గతంలోనే చూపించారు. ఇప్పుడు ఏమంటున్నారంటే.. హీరో పగిలే అద్దాలను చీల్చుకుంటూ తన గాళ్ ఫ్రెండ్ (హీరోయిన్ సురభి)తో కలసి అలా డెస్టినీని ఎదిరిస్తాడు అనే తరహాలో లుక్ ఉంది. ఎక్కడికిపోతావు చిన్నవాడా పోస్టర్ ను చూసినప్పుడు ఎలాగైతే డిఫరెంట్ గా అనిపించిందో.. ఇప్పుడు శిరీష్ ఒక్క క్షణం కూడా అలాగే ఉండేలా చూసుకున్నాడు విఐ ఆనంద్. ఇక అనూహ్యంగా డిసెంబర్ బరిలోకి దిగాడు అల్లు వారబ్బాయ్. ప్రమోషన్లు చకచకా స్టార్ట్ చేసి మనోళ్లు డిసెంబర్ 23న లేదంటే 29న సినిమాను రిలీజ్ చేస్తారట.