పవన్‌ ఓ జోకర్‌..!

276
- Advertisement -

పవన్ కళ్యాణ్‌ చూడడానికి సైలెంట్‌గా కనిపిస్తాడు. తెరవెనుక చేసే పనులు మాత్రం అంతగా ఎవరికీ తెలియవు. కానీ పవన్‌ తెరవెనుక ఎలా ఉంటాడన్న విషయాన్ని హీరోయిన్‌ కీర్తీసురేష్‌ చెప్పుకొచ్చింది. పవన్‌ కనిపించేంత సైలెంట్ కాదని, తెరవెనుక చాలా ఫన్నీగా ఉంటాడని చెప్పింది. పవన్‌ కు జోడీగా ‘అజ్ఞాతవాసి’లో నటిస్తోన్న కీర్తీ..ఇటీవలే డబ్బింగ్ కూడా ముగిసిందంటూ చెప్పిన విషయం తెలిసిందే.

 Pawan Kalyan a 'Joker'..

ఈ క్రమంలోనే ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తీ.. మాట్లాడుతూ, పవన్‌ కల్యాణ్‌ తెరవెనుక చాలా జోక్స్‌ వేస్తుంటాడని చెప్పింది. ఆయన వేసిన జోక్స్ కు త్రివిక్రమ్‌, అను (అను ఇమ్మాన్యుయెల్‌), యూనిట్‌ మొత్తం నవ్వుకుంటుంటామని చెప్పింది.

 Pawan Kalyan a 'Joker'..

అంతేకాకుండా ‘అజ్ఞాతవాసి’ సినిమా యూనిట్ మొత్తం పెద్ద కుటుంబంలా ఉంటామని, పవన్‌ కల్యాణ్‌ 25వ ప్రాజెక్టులో నటించడాన్ని చాలా ఎంజాయ్‌ చేస్తున్నానని తెలిపింది. ఇక త్రివిక్రమ్‌ డైలాగ్స్‌ లో కూడా చాలా చమత్కారం ఉంటుందని, తాము షూటింగ్ సందర్భంగా ఆ డైలాగులకు వచ్చే స్పందనను ఊహించుకుని సరదాగా గడిపేవారమని చెప్పుకొచ్చింది. మొత్తానికి పవన్‌ ఓ జోకర్ గా.. జోక్స్‌ వేస్తూ అందరినీ నవ్విస్తుంటాడని సరదాగా చెప్పుకొచ్చింది.

- Advertisement -