భాగ్యనగరికి మెట్రోహారం

169
Modi launches Hyd Metro
- Advertisement -

చారిత్రక హైదరాబాద్ నగర సిగలో మెట్రో మణిహారం చేరింది. గుర్రపు బగ్గీలతో ప్రారంభమైన నగర ప్రస్థానం.. మెట్రో రాకతో సమున్నత శిఖరానికి చేరుకుంది.   కోటికి పైగా జనాభ,  అరకోటికి చేరి నిత్యం ట్రాఫిక్‌‌తో నరక యాతన అనుభవిస్తున్న నగరవాసులకు మెట్రో రాక గొప్ప ఊరట కలిగించనుంది.

1879 నుంచి 1950 వరకు ప్రజారవాణా వ్యవస్థ నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వేలో కొనసాగింది. అప్పటికి దేశంలోని చాలా సంస్థానాల్లో ప్రజా రవాణావ్యవస్థ ప్రారంభమే కాలేదు. నిజాం రాజులు, బ్రిటీష్ కంపెనీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రైల్వేలైన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సికింద్రాబాద్-వాడి మధ్య రైల్వేలైన్ పనులు 1874లో పూర్తయ్యాయి. 1874 అక్టోబర్ 8న తొలి ప్యాసింజర్ రైలు మూడు బోగీలు, 150 మంది ప్రయాణికులతో నిజాం సంస్థానంలో తొలిసారి పరుగుపెట్టింది. అదేరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రారంభమైంది.

Modi launches Hyd Metro
1916లో కాచిగూడ రేల్వేస్టేషన్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని నిజాం గ్యారెంటెండ్ స్టేట్ రైల్వే ప్రధాన కార్యాలయంగా వినియోగించారు. 1930 తర్వాత పూర్తిగా హైదరాబాద్ సంస్థానం ఆధీనంలోకి వచ్చింది. 1951లో భారతీయ రైల్వే పరిధిలోకి వెళ్లింది.1932 ఏప్రిల్ 18న 27 బస్సులతో రవాణా మొదలైంది. తర్వాత రైల్వే, రోడ్డు రవాణాను అనుసంధానం చేస్తూ ఉమ్మడి రైలు, రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌ను ప్రారంభించారు.

తాజాగా అభివృద్ధి చెందిన దేశాల సాంకేతికత, నిర్వహణ నైపుణ్యాలు, అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో, దాదాపు 15 లక్షల మందికి రవాణా సేవలందించే విస్తృత ఏర్పాట్లతో   మెట్రో  పరుగులు పెట్టనుంది.

- Advertisement -