గోపిచంద్‌ ‘ఆక్సిజన్’ ట్రైలర్‌..

226
- Advertisement -

మాస్ హీరో గోపీచంద్ ‘ఆక్సిజన్’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ హీరో ‘ఆక్సిజన్’ ట్రైలర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇటీవల ఈ మూవీ సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా ప్రీ రిలీజ్ ట్రైలర్ అంటూ మరో ట్రైలర్‌ను వదిలింది. ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో గోపీచంద్, రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా తెరకెక్కుతున్న ఈమూవీ షూటింగ్ అనంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

ఇక ఆక్సిజన్ లేటెస్ట్ ట్రైలర్ విషయానికి వస్తే.. ‘ప్రతీ వూరిలో నీలాంటోడు ఒకడు ఉంటాడని తెలుసు.. కానీ నాలాంటోడు ఒకడు వస్తాడని నీకు తెలియదు’ అంటూ గోపీచంద్‌ ఎప్పటిలాగే సీరియస్‌గా విలన్‌కు వార్నింగ్ ఇచ్చేస్తుండటంతో ఆక్సిజన్ ట్రైలర్ రొటీన్‌గానే సాగింది. జగపతిబాబు ఎప్పటిలాగే ఎమోషన్స్ పండింస్తుండగా.. అనుఇమ్మాన్యుయేల్ రొమాంటిక్ సాంగ్‌తో రచ్చ చేస్తుంది.

Gopichand Oxygen Movie New Trailer

కమర్షియల్ హీరోగా మంచి మార్కెట్‌ను సొంతం చేసుకున్న గోపీచంద్‌కు ఇప్పుడు అంతగా కలిసిరావడంలేదు. ఈ మధ్య వచ్చిన ఆయన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టాయి. మాస్ హీరోగా ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించిన యాక్షన్ హీరో గోపీచంద్ తరువాత రోటీన్ పాత చింతకాయ పచ్చడి సినిమాలను పక్కన పెట్టి ఒక్కడున్నాడు, సాహసం, గౌతమ్ నంద లాంటి వైవిధ్యకథలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఇవికూడా బెడిసికొట్టడంతో తిరిగి తన పాత ఫార్ములా యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆక్సిజన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమా ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -