అంతా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, వైట్‌హౌస్ సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ ఉదయం 3.30 గంటలకు శంషాబాద్ లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు అధికారులు ఘన స్వాగతం పలికారు.
విమానాశ్రయం నుంచి ప్రత్యేక వాహనంలో మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు హెచ్ఐసీసీకి చేరుకుని కేంద్ర విదేశాంగశాఖా మంత్రి సుష్మాస్వరాజ్‌తో భేటీ అవుతారు. అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం హెచ్ఐసీసీకి చేరుకోనుంది ఇవాంక. మోడీతో కలిసి జీఈ సమ్మిట్‌లో పాల్గోన్న అనంతరం సాయంత్రం 6 గంటలకు ట్రైడెంట్ హోటల్‌కు చేరుకోనుంది.
తర్వాత ఫలక్‌నుమా ప్యాలెస్ చేరుకుంటారు. విందు అనంతరం రాత్రి 10.45 గంటలకు ఇవాంకా తిరిగి ట్రైడెంట్ హోటల్‌కు చేరుకుంటారు. తిరిగి రేపు రాత్రి 9.20 గంటలకు దుబాయ్ బయలుదేరుతారు.