2 కంట్రీస్‌..టీజర్‌పై పవన్‌ ప్రశంస

197
2 Countries Official Teaser
- Advertisement -

ఎన్ శంకర్ దర్శకత్వంలో సునీల్ హీరోగా తెరకెక్కుతున్న 2 కంట్రీస్. టాలీవుడ్‌లో హాస్య‌న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్.. ప్ర‌స్తుతం క‌థ‌నాయ‌కుడి పాత్ర‌ల్లో న‌టిస్తూ అల‌రిస్తున్నాడు.మల‌యాళంలో దిలీప్, మమతా మోహన్ దాస్ జంటగా తెరకెక్కిన 2 కంట్రీస్ అనే చిత్రానికి ఇది తెలుగు రీమేక్ వెర్షన్.

2 Countries Official Teaser
ఈ సినిమా టీజర్‌ను సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్  విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ… త‌న చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఈ టీజ‌ర్ ఉందని వ్యాఖ్యానించారు. టీజర్‌లానే సినిమా ఉంటుందని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు.

పవన్‌కల్యాణ్ త‌న‌ సినిమా టీజర్‌ను విడుదల చేయడం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ టీజ‌ర్‌ను ప్రశంసించిన ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని వ్యాఖ్యానించారు. సునీల్ సరసన మనీషా రాజ్  న‌టిస్తోంది.  ఇప్పటికే సోషల్ మీడియాలో 2 కంట్రీస్‌ టీజర్ వైరల్‌గా మారింది.

- Advertisement -