నగరంలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేశారు.హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్,ఎమ్మెల్యేలు లక్షణ్, కిషన్ రెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్లతో కలిసి ముషీరాబాద్, సనత్ నగర్, అంబర్ పేట్ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలను సందర్శించారు. జిహెచ్ఎంసీ అద్యర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకువచ్చిన ఇతర సమస్యలను పరిశీలించేందుకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి బస్సులో బయలుదేరిన మంత్రి మూడున్నర గంటల సుడిగాలి పర్యటన చేశారు.
మొదట బన్సీలాలపేటలో జీహెచ్ఎంసీ నిర్మించిన మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ను సందర్శించారు. ఈ కమ్యూనీటీ హాల్ ను అదర్శంగా తీసుకుని ఇతర చోట్ల ఇలాంటివే నిర్మిస్తే పేద ప్రజకు శుభకార్యాలు జరుపుకునేందుకు వీలుకలుతుందని, హాల్ నిర్మాణం కోసం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన ప్రత్యేక కృషికి అభినందనలు తెలిపారు.
దీంతోపాటు అక్కడ నిర్మాణం జరుగుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ సైటు ని సందర్శించారు. తర్వాత మంత్రి బృందం పలు నాలాలను పరీశీలించారు. పలు చోట్ల అసంపూర్తిగా ఉన్న రిటెయినింగ్ వాల్ నిర్మాణాన్ని వేంటనే చేపట్టాలని అధికారులకు అదేశాలు జారీ చేశారు. ముఖ్యం వైస్రాయ్ హోటల్ వద్దున్న నాలను పరిశీలించారు. తర్వతా దోమల్ గూడా సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఇక్కడ నూతన కార్యాలయ నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా సిసిపి అదేశించారు.
తర్వతా పలు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి, సిటీ సెంట్రల్ లైబ్రరీని సందర్శించారు. లైబ్రరీలో మౌళిక వసతుల అభివృద్ధికి తక్షణం అయిదుకోట్ల రూపాయలను విడుదల చేస్తామని తెలిపారు. దీంతోపాటు లైబ్రరీలో కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. దీంతోపాటు అక్కడ చదువుకుంటున్న విద్యార్దులతో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం హామీ ఇచ్చినా మేరకు లక్ష ఉద్యోగాల భర్తీని కచ్చితంగా పూర్తిచేస్తామన్నారు. ఇప్పటికే ఉద్యోగాల భర్తీకీ నోటిఫికేషన్లు ఇస్తున్నామని, వాటితోపాటు మరిన్ని నోటిఫికేషన్లు ఇస్తామని తెలిపారు. త్వరలోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాల క్యాలెండర్ ఇయర్ను ప్రకటిస్తామని తెలిపారు.
పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ఘంట చక్రపాణితో కలిసి కెరీర్ డెవలప్ మెంట్ సెంటర్ అవిష్కరణకు లైబ్రరీకి వస్తానని తెలిపారు. లైబ్రరీ డిజిటలైజేషన్ మరియు ఇతర అధునాతన సౌకర్యాలకు ప్రభుత్వం నిధులు ఇస్తుందన్నారు.ఆతర్వతా చిక్కడపల్లి, నారాయణ గూడలోని పాత జీహెచ్‌ఎంసీ మార్కెట్లను పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన వీటి స్ధానంలో అత్యుత్తమ ప్రమణాలతో కూడిన పలు అంతస్థుల మాడల్ మార్కెట్ నిర్మిస్తామని తెలిపారు. ఇందుకోసం వేంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి జీహెచ్‌ఎంసి అధికారులను కోరారు.