ఆకట్టుకుంటున్న ‘కణం’ ట్రైలర్..

273
kanam movie
- Advertisement -

ఫిదా సినిమాలో భానుమతిగా న‌టించిన సాయిప‌ల్ల‌వి తెలుగు ప్రేక్షకుల్ని నిజంగానే ఫిదా చేసింది. తెలంగాణ అమ్మాయిగా ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లోనూ ఆ మూవీ భారీ కలెక్షన్లు రాబట్టింది. తర్వాత నానితో కలిసి మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా ట్రైలర్‌తోనూ సాయి పల్లవి ఆకట్టుకొంది. ఈ మూవీ డిసెంబ‌ర్ 21న విడుద‌లకు ముస్తాబవుతోంది. యువ కథానాయకుడు నాగ శౌర్య సరసన ఓ ద్విభాషా చిత్రంలో సాయి పల్లవి నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాకు ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. సస్పెన్స్‌తో నిండిన సన్నివేశాలతో ఈ సినిమా ట్రైలర్ ఉంది.

Sai-Pallavi-s-Kanam

‘మా సారీ మా.. నేను చేసింది తప్పే. అలా అని ఇది వద్దమ్మా.. ప్లీజ్‌’ అనే డైలాగ్‌తో ట్రైల‌ర్ ప్రారంభమైంది. నాగశౌర్య, సాయిపల్లవిలు స‌హ‌జంగా న‌టించిన‌ట్లు తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లి సీన్‌తో ట్రైలర్ మొద‌ల‌వుతుంది. ఆశ్చర్యం కలిగించే ఎన్నో అంశాలను పొందుపరిచారు. ‘కృష్ణ నేను చెప్పేది వింటే నీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. నువ్వు నమ్మలేకపోవచ్చు. కానీ అది నిజం.. నువ్వు అన్ని మర్చిపోగలవేమో కానీ నేను మర్చిపోలేను’ అంటూ సాయిపల్లవి త‌న సొంత గొంతుతో డైలాగ్స్ చెప్పింది. ఆమె ఫిదా సినిమా మాదిరి మరోసారి ప్రేక్షకులను అలరించే అవ‌కాశం ఉంది. ఎవరో హత్యకు గురి కావడం, హంతకుడి కోసం పోలీసులు గాలింపు, క్షుద్ర పూజలు చేయడం.. తదితర సన్నివేశాలతో ఈ ట్రైలర్ విడుద‌లైంది. పెళ్లిచూపులు సినిమాలో నా సావు నేను స‌స్తా నీకెందుకు అని అల‌రించిన ప్రియ‌ద‌ర్శి ఈ సినిమాలో పోలీస్ పాత్ర పోషిస్తున్నాడు. చిన్న పాప చుట్టూ ఈ సినిమా కథ అల్లుకున్న‌ట్టు ఉంది.

- Advertisement -