32లో కూడా తలుక్కుమంటున్న తార..

200
- Advertisement -

అందాలతార నయనతార ఈరోజు తన 32వ పుట్టినరోజుని జరుపుకుంటోంది. నయన్ అసలు పేరు డయానా మరియమ్ కురియన్. 1984లో కేరళలో పుట్టిన ఈ కలువ కళ్ల మళయాల కుట్టి తన అందంతో అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. కాలేజీ చదివే రోజుల్లోనే పార్ట్ టైమ్ మోడెలింగ్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఓ సినీ డైరెక్టర్ దృష్టిలో పడి ‘మనస్సినక్కరే’ అనే మళయాల సినిమాతో 2003 లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళం, తెలుగు, కన్నడ సినిమాల్లో నటించి సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తన కెరియర్లో ఇప్పటివరకు మళయాల, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో కలిపి దాదాపు 60 సినిమాల్లో నయన్ నటించింది. ఇప్పటికీ స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోలు కోరుకునేది నయన్‌నే.ఇక తీవ్రంగా పోటీ నడుస్తోన్న ఈ రోజుల్లో కూడా ఏడాదికి నాలుగైదు సినిమాలను రిలీజ్ చేస్తోంది ఈ బ్యూటి.

Vignesh sends birthday wishes to Nayanatara

అయితే నయన తార కెరీర్ లో స్టార్ డమ్ తో పాటు పలురకాల వివాదాల్లో కూడా టాప్ లో నిలిచింది. అలాగే ఆన్ స్ర్కీన్ తన గ్లామర్ తో యువతను ఊర్రూతలూగించింది. సడన్ గా గ్లామర్ నుండి యాక్టింగ్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ.. తనకు తానే కొత్త బాష్యం చెప్పుకుంది. బెస్ట్ యాక్టర్ గా తనను తాను చాలా సార్లు నిరూపించుకొని పలు అవార్డులను కూడా అందుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును కూడా అందుకుంది. అంతే కాకుండా తమిళ ప్రభుత్వం ప్రకటించే కలైమామని పురస్కారాన్ని కూడా పొందింది.

Vignesh sends birthday wishes to Nayanatara

ఇక రెండు ప్రభుత్వాల నుండి అవార్డులను అందుకున్న నయన ప్రస్తతం చాలా బిజీగా ఉంది. తెలుగులోల్ మెగాస్టార్ చారిత్రాత్మక చిత్రం సైరలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా తమిళ్ లో నాలుగు సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒక సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఇకపోతే నయన్ తన పుట్టినరోజును బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ తో కలసి జరుపుకున్నట్లు.. అతను పోస్ట్ చేసిన ట్విట్టర్ పిక్ చూస్తే తెలుస్తోంది. అయితే గతంలో శింబు, ఆర్య, ప్రభుదేవాలతో ప్రేమ వ్యవహారం నడిపించి.. ఆ తర్వాత పెళ్ళి వరకు వెళ్ళి ఆగిపోవడం జరిగాయి. ప్రభుదేవాతో సహజీవనం వివాదాస్పదంగా మారి కోర్టు వరకు వెళ్ళింది. మరి ఇప్పుడు దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్తుందో లేదో చూడాలి.

- Advertisement -