సంక్రాంతి బరిలో మాస్ మహరాజా..

227
Ravi Teja touch chesi chudu release date
- Advertisement -

తెలుగు సినిమాలకు సంక్రాంతి సీజన్ అంటే కలిసొచ్చే కాలం. ఈ సీజన్ లో హిట్ కొడితే కలెక్షన్ల కనకవర్షం కురుస్తుంది. అందుకే హీరోలంతా ఈ టైంలో సినిమా రిలీజ్ చేయడానికి పోటీలు పడుతుంటారు. ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో అజ్ఞాతవాసితో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – జైసింహాతో నందమూరి బాలయ్య బరిలో దిగడానికి సిద్దమయ్యారు. తాజాగా వీరికి కాంపిటిషన్‌గా మాస్ మహరాజా రవితేజ వస్తున్నారు.

రాజాది గ్రేట్ సినిమాతో హిట్ కొట్టిన రవితేజ ప్రస్తుతం విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో టచ్ చేసి చూడు సినిమా చేస్తున్నాడు.  రాశి ఖ‌న్నా, సీర‌త్ క‌పూర్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం చిత్రీక‌రణ తుది ద‌శ‌లో ఉంది. కాగా, సంక్రాంతికి ఈ సినిమాని విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

రవితేజ గత సినిమాల్లో కృష్ణ – మిరపకాయ్ సంక్రాంతి టైంలోనే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అవిరెండూ సూపర్ హిట్టయ్యాయి. కాబట్టి సెంటిమెంటల్ గానూ ఈ సీజన్ కలిసొస్తుందని టచ్ చేసి చూడు మేకర్లు ఆశపడుతున్నారు. రాజ్ తరుణ్ హీరోగా నటించిన మూవీతోపాటు అనుష్క ప్రధాన పాత్రలో వస్తున్న భాగమతిని కూడా సంక్రాంతి నాటికి థియేటర్లకు తీసుకురావాలన్నది ఆ చిత్రాల మేకర్ల ఆలోచనగా తెలుస్తోంది. మొత్తంగా  ఈసారి పండగకు థియేటర్లు కొత్త సినిమాలతో కళకళలాడటం ఖాయంగానే కనిపిస్తోంది.

- Advertisement -