అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న “సవ్యసాచి” రెగ్యులర్ షూట్ నేటి నుంచి మొదలయ్యింది. నాగచైతన్య సరసన బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ ఎగ్జయిటింగ్ థ్రిల్లర్ హై ప్రొడక్షన్ స్టాండర్డ్స్ తో రూపొందనుంది. స్టార్ యాక్టర్ మాధవన్ ఈ చిత్రంలో స్పెషల్ అప్పీరియన్స్ ఇవ్వనున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. “చిలుకూరు బాలాజీ గుడి దగ్గర్లో ఒక స్పెషల్ సెట్ లో ఇవాల్టి నుంచి షూటింగ్ మొదలుపెట్టాం. నాగచైతన్య, నిధి అగర్వాల్, వెన్నెల కిషోర్, సత్యల కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నాం. తాజా షెడ్యూల్ 15 రోజులవరకూ సాగుతుంది. డిసెంబర్ లో మొదలవ్వనున్న మరో షెడ్యూల్ నుంచి మాధవన్ కూడా టీం లో జాయినవుతారు. చందు మొండేటి రాసిన సూపర్బ్ హీరో క్యారెక్టరైజేషన్ కు “సవ్యసాచి” అనేది యాప్ట్ టైటిల్. “ప్రేమమ్” లాంటి సెన్సేషనల్ హిట్ అనంతరం అక్కినేని నాగచైతన్య-చందు మొండేటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో మంచి అంచనాలున్నాయి.హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా “సవ్యసాచి” తెరకెక్కనుంది. ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచే స్థాయిలో సినిమా ఉంటుంది” అన్నారు.
నాగచైతన్య అక్కినేని, నిధి అగర్వాల్, మాధవన్, రావురమేష్, వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్ లు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, సినిమాటోగ్రఫీ: యువరాజ్, కళ: రామకృష్ణ, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, పోరాటాలు: రామ్-లక్ష్మణ్, కో-డైరెక్టర్: చలసాని రామారావు, సి.ఈ.ఓ: చిరంజీవి (చెర్రీ), లైన్ ప్రొడ్యూసర్: పిటి.గిరిధర్, నిర్మాతలు: వై.నవీన్-వై.రవిశంకర్-మోహన్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: చందూ మొండేటి.