బుల్లితెర యాంకర్ రష్మీ గురించి అందరికీ తెలిసిందే… జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ సినిమా హీరోయిన్‌గానూ తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలే ఆమె నటించిన నెక్స్ట్ నువ్వే మూవీ విడుదలైంది. సినిమాల్లో నటించడం కోసం ఒంటరిగా హైదరాబాద్ వచ్చిన రష్మీ ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. సినిమా ఇండస్ట్రీ ఎన్నో అవకాశాలు నేర్పుతుంది. నేను కూడా చాలా విషయాల్నే నేర్చుకున్నా అని ఆలీ నిర్వహించిన ‘ఆలీతో సరదాగా’ అనే షోలో తెలిపింది రష్మీ.
అంతే కాకుండా తాను మూడేళ్ల నుంచి ఒక అబ్బాయితో ప్రేమలో ఉన్నానని, అతడినే పెళ్లి చేసుకుంటానో లేదో తనకే తెలియదని , అతడెవరో మాత్రం చెప్పలేనని, తనది తెలుగు రాష్ట్రం కాదని, యూపీ, ఒడిశా నేపథ్యం అని.. వైజాగ్ లో పుట్టి పెరిగానని రష్మీ చెప్పింది.మీరు మరీ గ్లామరస్‌గా నటిస్తున్నారు` అనే ప్రశ్నకు స్పందిస్తూ.. `ఈ ప్రశ్న నాకు తరచూ ఎదురువుతుంటుంది. ఓ ఐదేళ్లు పోయిన తర్వాత నేను గ్లామరస్‌గా నటిస్తానన్నా ఎవరూ చూడరు. ఈ టైమ్‌లోనే మేము సెటిల్ అవ్వాలి` అని రష్మి తెలిపింది. ఇక వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నానని చెప్పింది.