పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మనం అంటున్న- వింటున్న మాట ….సాధారణంగా భార్యా భర్తల్లో భర్త వయసు ఎక్కువగాను, భార్య వయసు తక్కువగానూ ఉంటుంది. ఇది ఇలాగే ఉండాలా? భర్త వయసు తక్కువగా ఉంటే ఏమవుతుంది? మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం ఆడవాళ్లందరూ తమ కన్నా ఎక్కువ వయసున్న వారినే పెళ్లి చేసుకుంటారు. సహజంగానే మహిళలకు తెలివి ఎక్కువగా ఉంటుంది. వీరు 3-5 సంవత్సరాలు అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తారు. కాబట్టి…వీరికి వీరి కన్నా ఎక్కువ వయస్సున్న వారితో వివాహం జరిపించి బ్యాలెన్స్ చేస్తారన్నమాట.
మన దేశంలో ఆడవారు తమ కంటే చిన్న వారైన మగవారిని పెళ్లి చేసుకునే సందర్భాలు చాలా తక్కువ. మనం ఒకసారి తమ కంటే తక్కువ వయస్సున్న మగవారిని పెళ్లి చేసుకున్న ఆడవారి గురించి తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన తన కంటే నాలుగేళ్లు చిన్నవాడైన రామ్ చరణ్‌ను పెళ్లి చేసుకుంది. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ తన కంటే రెండేళ్లు చిన్నవాడైన అభిషేక్ బచ్చన్ ను పెళ్లాడింది. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య తన కంటే ఒకటిన్నర సంవత్సరం చిన్నవాడైన ధనుష్ ను వివాహం చేసుకుంది. సచిన్ టెండూల్కర్ భార్య అంజలి తన కంటే చిన్నవాడైన సచిన్ ను పెళ్లి చేసుకుంది.