ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు రాజన్‌తో ఆమ్ అద్మీ పార్టీ సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వెలువడుతున్నాయి. త్వరలో ఢిల్లీ అసెంబ్లీ కోటాలో ఆప్ నుంచి ముగ్గురు రాజ్యసభకు ఎన్నికవుతుండగా వీటిలో ఒక స్ధానాన్ని రాజన్‌తో భర్తీ చేయాలని కేజ్రీవాల్ భావిస్తుఉన్నారట. ప్రస్తుతం ఈ వార్త ఢిల్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
గతేడాది మోడీ సర్కార్ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని రాజన్ వ్యతిరేకించడంతో ఆయన పదవీకాలాన్ని పొడగించడానికి కేంద్రం సుముఖత చూపలేదు. రాజన్ స్థానంలో ఊర్జిత్ పటేల్ ను ఆర్బీఐ గవర్నర్ గా చేసింది. ఆ తర్వాత కీలకమైన నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో తనకు ఎంతో ఇష్టమైన అధ్యాపక వృత్తిని రాజన్ షికాగో యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.
రాజ్యసభకు సాదాసీదా రాజకీయ నేతలను పంపడానికి బదులు.. రాజన్ లాంటి ఆర్థిక వేత్తను పంపడం మేలనేది కేజ్రీవాల్ ఆలోచనగా తెలుస్తోంది.
ఆర్థిక వేత్తగా నోబెల్ బరిలో నిలిచిన మేధావి కావడంతో.. ఆయనను రాజ్యసభ పంపడం తమకూ గౌరవ ప్రదం అవుతుందని ఆప్ భావిస్తోంది. మరి దీనిపై రాజన్ స్పందన ఎలా ఉంటుఉందో వేచిచూడాలి.