ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అద్బుతం సాధించాడు. ఒకే మ్యాచ్‌లో రెండు హ్యాట్రిక్‌లతో యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్‌కు హెచ్చరికలు జారీ చేశాడు. షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో భాగంగా వెస్టర్న్ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో సోమవారం తొలి హ్యాట్రిక్ తీసిన స్టార్క్.. మంగళవారం మరో హ్యాట్రిక్
తీశాడు. ఇలా ఒకే మ్యాచ్‌లో ఒకే బౌలర్ రెండుసార్లు హ్యాట్రిక్ తీయడం షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో ఇదే తొలిసారి.
1912లో ఆస్ట్రేలియా బౌలర్ టీజే మాథ్యూస్ ఇంగ్లండ్‌పై ఒకే టెస్ట్‌లో రెండుసార్లు హ్యాట్రిక్ తీశాడు. ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 1979 తర్వాత ఇలా డబుల్ హ్యాట్రిక్ తీయడం ఇదే తొలిసారి. 1979లో కంబైన్డ్ ఎలెవన్ టీమ్‌కు చెందిన అమిన్ లఖానీ ముల్తాన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇండియాపై డబుల్ హ్యాట్రిక్ తీశాడు. తాజాగా స్టార్క్ రెండు హ్యాట్రిక్‌లతో క్రికెట్‌లో సరికొత్త చరిత్రసృష్టించాడు. ఈ ఏడాది మార్చిలో బెంగళూరులో భారత్‌తో జరిగిన చివరి టెస్ట్‌లో స్టార్క్ ఆడిన స్టార్క్ త్వరలో ఇంగ్లాండ్‌తో జరగబోయే యాషెస్ సిరీస్‌లో పాల్గొననున్నాడు.