సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు నటీమణులు లైంగిక వేధింపులకు గురవుతుంటారని ఇప్పటివరకు చాలా మంది ఆరోపణలు చేశారు. అయితే ఈ మద్యన హాలీవుడ్ లో ఓ నిర్మాత అసలు రంగు బయటపడటంతో అందరూ తాము కూడా లైంగిక వేధింపులకు గురయ్యామని తెలిపారు. బాలీవుడ్ – టాలీవుడ్ అనే కాకుండా కోలీవుడ్ హీరోయిన్స్ కూడా అలాంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్నామని తెలిపారు.
ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్ అయితే ట్విట్టర్ లో వేధింపులను ఎదుర్కొన్నట్లు #మీటూ..అంటూ అనేక ట్వీట్లు చేశారు. కానీ ఒక బ్యూటీ మాత్రం బాలీవుడ్ అలాంటిది కాదు అని అంటోంది. శ్రీలంక నుంచి వచ్చి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రానిస్తోన్న జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఈ విషయం గురించి తనదైన శైలిలో స్పందించింది. బాలీవుడ్ లో అలాంటివి జరుగుతాయి అని నేను చెప్పను.
బాలీవుడ్ చాలా మంచి ఇండస్ట్రీ. కానీ కొందరి వల్ల ఆ చెడ్డ పేరు వస్తోంది. ఎంత మంది లైంగిక వేధింపులకు గురయ్యారో నాకు తెలియదు. నేను మాత్రం అలాంటి పరిణామాలను ఎప్పుడు ఎదుర్కోలేదు. అలాంటి వాతావరణం కూడా నాకు కనిపించలేదు. అందరు ఎంతో ఫ్రెండ్లిగా ఉంటారని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.