- Advertisement -
నిన్ను కోరి సినిమాలో నాని గెటప్ గుర్తుందా..? ఈ సినిమాలో నాని గడ్డంతో కనిపిస్తాడు. చూడటానికి ఆ గడ్డం చాలా నాచురల్‌గా కనిపిస్తుంది. స్క్రీన్‌పైనే కాదు. బయట కూడా అంటే షూటింగ్ సమయంలో కూడా ఆ గడ్డం చూసిన వారంతా అది రియల్ గడ్డమే అని భావించేవారట. అంత నాచురల్‌గా నానికి గడ్డాన్ని సెట్ చేశారట.
దీని కోసం ఓ అమెరికన్ చాలా కష్టపడ్డారట. ఈ విషయాన్ని కోన వెంకట్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. “ప్రతిరోజూ నానికి గడ్డాన్ని సెట్ చేయడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టేది. మా లోకేషన్‌కు ఎవరు వచ్చినా ఆ గడ్డం ఒరిజినల్ అనుకునేవారు. ఓ అమెరికన్ దాన్ని సెట్ చేసేవారు.” నిన్ను కోరి సినిమాకు వెంకట్ స్క్రీన్‌ప్లే అందించారు. ఈ సినిమాలో నాని భగ్న ప్రేమికుడిగా నటించారు.
- Advertisement -