దళిత, బలహీనవర్గాలు, మైనార్టీలకు సమప్రాధాన్యమిస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. శాసనసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. లక్షా 12 వేల ఉద్యోగాలు 100 శాతం భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. సభలో అంబేద్కర్ ఓవర్సీస్ పథకం, గ్రూప్-2 ప్రశ్నలపై సీఎం మాట్లాడారు. అంబేద్కర్ ఓవర్సీస్ పథకానికి పరిమితి లేదని, అర్హులందరికీ ఈ పథకం వర్తింపచేస్తామని సీఎం హామీ ఇచ్చారు. బలహీన వర్గాల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని సీఎం ఈ సందర్భంగా తెలియజేశారు.
ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా భర్తీ ఉంటుందని, టీఎస్‌పీఎస్సీలో అనేక సంస్కరణలు చేపట్టిన ఘంటా చక్రపాణిని యూపీఎస్సీ అభినందించిందని సీఎం గుర్తు చేశారు. విద్యార్థులను రెచ్చగొట్టేలా పాత రాజకీయాలు చేస్తున్నారన్నాయని ప్రతిపక్షాలను విమర్శించారు. నిర్మాణాత్మక సలహాలిస్తే స్వీకరిస్తం కాని.. అడ్డగోలుగా మాట్లాడితే గౌరవం ఉండదని సీఎం హెచ్చరించారు.
చెప్పిన దానికంటే వెయ్యి ఉద్యోగాలు ఎక్కువగానే ఇస్తామని అన్నారు. గోల్కొండ ఉపన్యాసంలో అన్నమాట ప్రకారం లక్షా 12 వేలు ఉద్యోగాలు కల్పిస్తామని… దానికంటే వెయ్యి ఉద్యోగాలు ఎక్కువగా ఇస్తామన్నారు. ఆవాసీయ విద్య లక్షా 20వేల రూపాయలు ఖర్చుపెట్టే విధానాన్ని తీసుకొచ్చామన్నారు.

